Worst FoodsFor Human Body: మన శరీరానికి సరిపోని అనేక రకాల ఆహారాలు ఉంటాయి. ఇవి రుచికి బాగుంటాయి అని ఎక్కువ తింటే ప్రాణాలనే తీస్తాయి. వీటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఒక ఐదు రకాల ఆహారాలు తీసుకోకపోవడం ఐదు రకాల ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్..
వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు ఎక్కువగా ఈ ఆర్టిఫిషియల్ స్వీటెనర్‌ ఉపయోగిస్తారు. అంతే కాదు డయాబెటిస్ బాధపడే వారికి కూడా ఇది ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని అతిగా తీసుకోవడం వల్ల ప్రాణాంతక పరిస్థితులు వస్తున్నాయి. వీటిని అతిగా తీసుకోవడం వల్ల బరువు పెరిగేలా చేస్తుంది.


ఫ్రైడ్ ఫుడ్స్..
ఫ్రై చేసిన ఆహారాలు రుచికి బాగుంటాయి. కానీ వీటితో అనారోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి. ట్రై చేసిన ఆహారాల్లో అనారోగ్యకరమైన కొవ్వులు అతిగా ఉంటే అంతేకాదు ఇందులో క్యాలరీలు కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీంతో బరువు పెరిగిపోతారు. ఇలాంటి ఆహారాలు డైట్ లో చేర్చుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ సమస్యలు రావచ్చు అంతేకాదు డయాబెటిస్ బారిన కూడా పడతారు పెరిగే ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే ఎక్కువ మంటలో ఇలాంటి ఆహారాలు వేడి చేస్తారు కాబట్టి అవి శరీరానికి హానికరం చేస్తాయి.


హై సోడియం..
సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలు ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి డైట్లో చేర్చుకోవడం వల్ల కూడా వెయిట్ పెరుగుతారు. ప్రాణాంతక పరిస్థితులు వస్తాయి. స్ట్రోక్‌, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోకుండా దూరంగా ఉండాలి.


ఫాస్ట్ ఫుడ్..
ఫాస్ట్ ఫుడ్ రుచికరంగా ఉంటుంది. ముఖ్యంగా చైనీస్ వంటకాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటారు ఇందులో ఉపయోగించే ఆ మసాలాలు మాత్రం ఆరోగ్యానికి హానికరమైన క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్ ప్రైస్ నూడిల్స్ వంటివి చేర్చుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. గుండె సమస్యలు వస్తాయి. డయాబెటిస్ పెరిగే ప్రమాదం ఉంది అంతేకాదు తరచుగా ఈ ఫాస్ట్ ఫుడ్ డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు పెరుగుతారు.


రిఫైండ్ కార్బోహైడ్రేట్స్..
రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ అంటే వైట్‌ బ్రెడ్‌ వంటివి డైట్లో చేర్చుకోకూడదు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెంచేస్తాయి టైప్ 2 డయాబెటిస్ బారిన ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇవి అతిగా తినేలా చేస్తాయి. అంతేకాదు ఇందులో మైదా ఉపయోగిస్తారు కాబట్టి బరువు కూడా పెరుగుతారు. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెంచేస్తాయి.


ఇదీ చదవండి: అచ్చ తెలుగు గోంగూర పప్పు.. ఇలా చేశారంటే ఒక్క ముద్ద మిగలదు..


ప్రాసెస్ చేసిన ఆహారాలు..
ప్రాసెస్ చేసిన ఆహారాల్లో కూడా ఎక్కువ శాతం ఉప్పు ఉంటుంది, నైట్రేట్స్ ఉంటాయి. కొన్ని నివేదికల ప్రకారం ఇవి క్యాన్సర్‌ని అభివృద్ధి చేస్తాయి. గుండె సమస్యలను తెచ్చి పెడతాయి. ఈ ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరిగిపోతాయి. ఇది ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది ముఖ్యంగా రెడ్ మీట్ ఇవన్నీ ప్రాసెస్ చేసిన ఆహారాలు కాబట్టి వీటికి దూరంగా ఉండేలా చూడండి.


ఇదీ చదవండి: క్యాలరీలు తక్కువగా ఉండే ఈ 5 కూరగాయలతో బెల్లీఫ్యాట్‌ కరిగిపోవడం ఖాయం..!


ట్రాన్స్ ఫ్యాట్..
ట్రాన్స్ ఫ్యాట్ అంటే ముఖ్యంగా ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాయిల్స్ స్థాయిలను పెంచేసి మంచి కొలెస్ట్రాల స్థాయిని తగ్గిస్తాయి. తద్వారా గుండె సమస్యలకు దారితీస్తుంది త్వరగా ప్రాణాంతక వ్యాధుల బారిన పాడుతారు. ట్రాన్స్ ఫ్యాట్ ముఖ్యంగా బేక్ చేసిన ఆహారాల్లో ఉంటాయి.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.