Gongura Pappu: అచ్చ తెలుగు గోంగూర పప్పు.. ఇలా చేశారంటే ఒక్క ముద్ద మిగలదు..

Gongura Pappu Recipe: గోంగూర పప్పు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్‌. మన బామ్మల కాలంనాటి నుంచి ఈ రిసిపీ తయారు చేసుకుంటారు. పుల్లపుల్లగా రుచికరంగా ఉంటే ఈ రిసిపీతో ఆరోగ్యం కూడా మీ సొంతం. అయితే, అచ్చ తెలుగు స్టైల్‌లో గోంగూర పప్పు ఎలా తయారు చేయాలి తెలుసుకుందాం.
 

1 /5

గోంగూర పప్పు తయారీ విధానం.. ముందుగా కందిపప్పు శుభ్రంగా కడిగి ఓ అరగంటపాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్‌లో కందిపప్పుతో పాటు పసుపు, ఒక చుక్క నూనె వేసి ఓ మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించుకోవాలి.  దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి.

2 /5

ఆ తర్వాత గోంగూర, రెండు టమోటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్‌ చేసి పెట్టుకోవాలి. మరో వైపు కొద్దిగా చింత పండు కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఓ ప్యాన్‌ తీసుకుని అందులో నూనే పోయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత ఇందులో టమోటాలు వేయాలి.   

3 /5

టమోటాలు బాగా మగ్గిన తర్వాత గోంగూర కూడా వేసి నూనె పైకి తేలేవరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఉడికించిన పప్పు, ఉప్పు వేయాలి.  

4 /5

ఇప్పుడు మరో తాలింపు కడాయి తీసుకుని అందులో ఆవాలు, జిలకర్ర, వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకోవాలి. చివరగా కరివేపాకు కూడా ఇందులో వేయాలి. ఇప్పుడు ఈ తాలింపును పప్పులో వేయాలి.  

5 /5

గోంగూరను రెగ్యులర్‌గా మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఇనుము లభిస్తుంది. అంతేకాదు ఈ సీజన్‌లో మన శరీరానికి వెచ్చదనాన్ని కూడా అందిస్తుంది. గోంగూర ఆకుకూర కాబట్టి తరచూ మన డైట్‌లో ఉండేటా జాగ్రత్తలు తీసుకోవాలి.