Belly Fat Burning Vegetables: సాధారణంగా మనం ప్రతిరోజు కూరగాయలు వండుకుంటాం ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. అంతే కాదు ఇందులో విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరం మాత్రమే కాదు, బరువు కూడా సులభంగా తగ్గిస్తాయి. కొన్ని రకాల కూరగాయలు డైట్లో చేర్చుకోవడం వల్ల నీటి శాతం అధికంగా ఉంటుంది అంతేకాదు ఇందులో క్యాలరీల శాతం కూడా తక్కువగా ఉంటుంది.
టమాటాలు..
టమాటాలు సులభంగా మన ఇంట్లో ఉంటాయి. ఇవి మార్కెట్లో కూడా సులభంగా అందుబాటులో ఉంటాయి. టమాటా లేనిదే వంట చేసుకోలేని పరిస్థితి. ప్రతిరోజు మన భారతదేశంలో టమాటాలు విరివిగా ఉపయోగిస్తారు అయితే టమాటాలతో కూడా మనం బరువు ఈజీగా తగ్గొచ్చు ఇందులో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్ బరువు తగ్గించడంలో కీలకపాత్ర పోషించి ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె సమస్యలు కూడా మీ దరిచేరకుండా ఉంటాయి. సాధారణంగా టమాటాలను మన స్కిన్ కేర్ రొటీన్ లో కూడా ఉపయోగిస్తాం. దీంతో మెరుగైన ఛాయ మీ సొంతం అవుతుంది. అలాగే ప్రతిరోజు ఒక టమాటా తీసుకోవడం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. అయితే టమాటాలను కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోకూడదు. టమాటాలు డైట్లో చేర్చుకోవాలి అనుకునేవారు సలాడ్ కూరల్లో ఉపయోగించవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.
బెల్ పెప్పర్స్..
బెల్ పేపర్స్ చైనీస్ ఐటమ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే బెల్ పేపర్స్ తో కర్రీ, ఫ్రై కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బెల్ పేపర్స్ ను ఉపయోగించి కూడా మీరు సులభంగా బరువు తగ్గొచ్చు. బెల్ పేపర్లో విటమిన్ సి ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని బలపరుస్తుంది. సీజనల్ వ్యాధులకు చెక్ పెడుతుంది. అంతేకాదు బెల్ పెప్పర్ తింటూ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. దీన్ని గ్రిల్ చేసి స్టఫ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. బెల్ పెప్పర్ మూడు రంగుల్లో ఉంటుంది. ఎరుపు, పసుపు, గ్రీన్ ఎక్కువ శాతం మనం పచ్చ రంగుల బెల్ పేపర్ ఉపయోగిస్తాం. అయితే ఎరుపు రంగులో ఉన్నది కూడా రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ మూడు రకాలు కలిపి కూడా వండుకోవచ్చు.
పాలకూర..
ప్రతి ఒక్కరికి పాలకూర గురించిన ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పాలకూర అయినది ఆకుకూర వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా తినాల్సిందే. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. మన కంటి చూపుకి ఎంతో మెరుగు చేస్తుంది. అంతేకాదు ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల పాలకూరను డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. పాలకూరలో ఉండే విటమిన్ సి ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనికి అతిగ తినకుండా ఉంటారు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు పాలకూర సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: ఒక చుక్క కొబ్బరి నూనెతో ముఖంపై ఒక మచ్చ.. గీత కూడా కనిపించదు..
కీర దోసకాయ..
మనందరికీ తెలిసిన విషయమే కీర దోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. వీటిని మీ డైట్లో చేర్చుకోవడం వల్ల కడుపునిండిన అనుభూతి కలుగుతుంది. ఎక్కువ ఆకలి వేయదు వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు కీరదోసలు తప్పకుండా డైట్లో చేర్చుకోవాలి. దీని రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోవడం వల్ల కడుపు సమస్యలు కూడా చెక్ పెట్టొచ్చు. కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది హాయినిస్తుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు కీరదోసను తింటూ వెడ్స్ సులభంగా తగ్గిపోవచ్చు.
ఇదీ చదవండి: SkinCare: స్కిన్ కేర్ రొటీన్‌లో సీతాఫలం.. రెట్టింపు నిగారించే అందం మీ సొంతం..
క్యాలీఫ్లవర్..
క్యాలీఫ్లవర్ కూరగాయతో కూడా బలు ఈజీగా తగ్గిపోతారు. ఎందుకంటే ఇందులో కూడా క్యాలరీల శాతం తక్కువగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్స్ పుష్కలంగా ఉండే ఈ క్యాలీఫ్లవర్ కూర, ఫ్రై రూపంలో తీసుకోవచ్చు. అంతేకాదు క్యాలీఫ్లవర్ సూప్ మాదిరి కూడా తీసుకుంటారు. వీటిని రైస్ లేదా చపాతీ లోకి డైట్ లో చేర్చుకుంటే బరువు ఈజీగా తగ్గిపోతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.