COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

What Causes Yellow Nails: ఏదైనా అనారోగ్య సమస్య బారిన పడి వైద్యుల్ని సంప్రదించినప్పుడు ముందుగా వారు గోళ్లు, నాలుకను పరీక్షిస్తారు. వీటిని బట్టి శరీరంలోని ఎలాంటి సమస్యలు ఉన్న గుర్తించే అవకాశాలున్నాయి. ఎందుకంటే గోర్లు ప్రోటీన్ పొరలతో తయారై ఉంటాయి ఇవి కాలి వేలను రక్షించడమే కాకుండా బాడీలో జరుగుతున్న అనేక రకాల మార్పులను సూచిస్తాయి. రాజుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి గోళ్లు రంగు మారి ఉంటాయి. పసుపు రంగు గోళ్లు ఉన్నవారు త్వరలోనే రక్తహీనత, గుండె సమస్యలు, కాలేయ సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయని సూచిస్తాయి. పగిలిన గోళ్లు తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీయొచ్చని సంకేతాలనిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి శరీరంలోని ప్రతి ఒక్క మార్పును తెలియజేస్తాయి. 


విరిగిన లేదా పగిలిన గోళ్లు:
ప్రస్తుతం చాలామందిలో గోళ్లు విరగడంతో పాటు పగిలిపోతూ పగిలిపోతూ ఉంటాయి. ఇలాంటి సంకేతాలు థైరాయిడ్ వ్యాధిని సూచిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించడం చాలా మంచిది లేకపోతే తీవ్ర ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


రంగులేని గోళ్లు:
రంగు మారిన గోళ్లను వైద్య పరిభాషలో ల్యుకోనిచియా అంటారు. ఇలాంటి లక్షణాలు మీ గోళ్ళలో కనిపిస్తే రక్తహీనత సమస్య ఉన్నట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా కూడా గోళ్లు రంగు మారే అవకాశాలు ఉన్నాయి.


పసుపు రంగు గోళ్లు:
కొంతమందిలో అత్యంత సాధారణంగా ఉండే గోళ్లు సులభంగా పసుపు రంగులోకి మారిపోతాయి. ఇలాంటి లక్షణాలు మీ గోళ్ళలో ఉంటే తీవ్ర ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా మదిమేహం, థైరాయిడ్, ఊపిరితిత్తుల సమస్యలు, గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


నీలం రంగు గోళ్లు:
కొంతమందిలో గోళ్లు నీలం రంగులోకి కూడా మారే అవకాశాలున్నాయి. ఇలా రంగు మారడం వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రంగులోకి మారిన గోళ్లు శరీరంలోని తక్కువ ఆక్సిజన్ స్థాయిలను సూచిస్తాయి. దీంతోపాటు తీవ్ర ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా వచ్చే ఛాన్స్ లు కూడా ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


గోళ్లు కలర్లు మారడానికి ప్రధాన కారణాలు:
చాలామందిలో వయస్సు పెరిగే కొద్దీ శరీరంలోని అవయవాలు కూడా దెబ్బతినడం ప్రారంభమవుతాయి. దీని కారణంగా గోర్లు బలహీనంగా తయారవుతాయి అంతేకాకుండా వివిధ రకాల కలర్లు మారే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.


కొంతమందిలో ఐరన్ లోపం కారణంగా కూడా గోళ్లు రంగు మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సకాలంలో వైద్యులను సంప్రదించి ఐరన్ లోపాన్ని నియంత్రించుకుంటే చాలా మంచిది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.


గోళ్లు రంగు మారడానికి అసలైన కారణం ప్రోటీన్, మెగ్నీషియం లోపమేనని మరి కొంతమంది వైద్యులు చెబుతున్నారు. ఇటీవల పరిశోధనల ప్రకారం చాలామంది ప్రోటీన్ లోపంతో బాధపడే వారిలో ఇలాంటి సమస్యలు కూడా వచ్చాయని వారు అంటున్నారు.


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి