Abhinav: గంజాయ్ మరియు బాల కార్మిక వ్యవస్థపై బ్రహ్మాస్త్రంగా తెరకెక్కిన ‘అభినవ్’ మూవీ..
Abhinav: శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న బాలల చిత్రం `అభినవ్` (chased padmavyuha). భీమగాని సుధాకర్ గౌడ్ నిర్మాత మరియు దర్శకునిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ట్రైలర్ ను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో రిలీజ్ చేశారు.
Abhinav: తెలుగులో ఈ మధ్యకాలంలో డ్రగ్స్ నేపథ్యంలో చాలా చిత్రాలొచ్చాయి. అందులో ఎక్కువగా డ్రగ్స్ వాడకాన్ని చూపిస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా గంజాయ్ మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘అభినవ్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్న కుమార్, నిర్మాత దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ రిలీజ్ చేశారు.
గ్రామీణ ప్రాంతాలలోని హరిజన, గిరిజన విద్యార్థుల చేత సత్య అనే మాఫియాడాన్ విద్యార్థులతో గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటాడు. బంటి అనే గిరిజన బాలుడు స్మగ్లర్ చేతిలో పావుగా మారి గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటాడు. భారతి అనే అభ్యుదయ ఉపాధ్యాయురాలి ద్వారా ప్రేరణ పొందిన అభినవ్, రోహన్, అక్షర మరియు ఇతర బాల బాలికలు ఎన్‌సీసీ మరియు ఆర్మీ శిక్షణ పొందుతుంటారు. ఎన్ఎస్ ఎస్ ప్రొగ్రాం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిన గిరిజన విద్యార్థుల స్థితిగతుల నేపథ్యంలో డ్రగ్ మాఫియాను అంతం చేయడానికి కొంత మంది ఆర్మీ తరహా శిక్షణ తీసుకున్న వాళ్లు.. గంజాయి మాఫియాలో చిక్కుకున్న విద్యార్ధులను ఎలా బంధ విముక్తులను చేసారు. చివరకు గంజాయి మాపియా డాన్ ను ఎలా తన దగ్గర బంధిలే ఎలా మట్టు బెట్టురనే నేపథ్యంలో ‘అభినవ్’ సినిమాను తెరకెక్కించారు.
‘అభినవ్’ చిత్రం యొక్క ప్రధాన ఉద్దేశం బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం. మరియు గంజాయి మాఫియకు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు బలి కాకుండా మరియు విద్యార్థి దశ నుండే ఎన్ ఎస్ ఎస్ మరియు ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లలో శిక్షణ పొంది దేశ రక్షణలో విద్యార్ధులు ఎలా భాగస్వాములు చేసారనేది ఈ సినిమా కథ.
ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో సమ్మెట గాంధీ మరియు మాఫియా డాన్ గా సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర బాల నటులుగా నటించారు. ఈ సినిమాకు కెమెరా మెన్ గా సామల భాస్కర్, సంగీతం - వందే మాతరం శ్రీనివాస్, ఎడిటర్ - నందమూరి హరి, ఈ చిత్రాన్ని సారథి స్టూడియో యొక్క సహకారంతో నిర్మించారు.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter