Hyderabad Rains: భాగ్యనగరాన్ని భయపెడుతున్న భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్..
Heavy Rains: భారీ వర్షాలకు హైదరాబాద్ తడిసిముద్దయింది. ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Telangana rain Update: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం (Heavy Rains in Hyderabad) విల్లవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో భాగ్యనగరానికి ఇవాళ, రేపు రెడ్ అలర్ట్ (Red alert) జారీ చేసింది వాతావరణ శాఖ. మంగళవారం కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీల్లో వరద నీరు చేరింది. డ్రైనేజీలన్నీ పొంగిపొర్లుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది.
ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహానికి హుస్సేన్‌సాగర్ నిండుకుండను తలపిస్తోంది. అంతేకాకుండా నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. షేక్‌పేట పరిధిలోని శాతం చెరువు పూర్తిగా నిండిపోయింది. దీని కారణంగా టోలీచౌకీలోని పలు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శాతం చెరువుకు గండికొట్టి నీటిని మూసీలోకి వదులుతున్నారు. వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తం అయింది. డీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేసింది.
నగరంలోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఐటీ క్యారిడార్లో రెండు రోజులపాటు ఆఫీసు వేళలు మార్చుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా.. ఐటీ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు ఒకేసారి బయటికి రాకుండా వేర్వేరు లాగౌట్ టైమింగ్స్ ను పెట్టుకున్నారు. ఐకియా నుంచి సైబర్ టవర్ వరకు ఉన్న కంపెనీలు.. మధ్యాహ్నం 3 గంటలకు, ఐకియా, బయోడైవర్సిటీ, రాయదుర్గం పరిధిలోని.. కంపెనీలు సాయంత్రం నాలుగున్నర గంటలకు.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలిలోని కంపెనీలు సాయంత్రం ఆరు గంటలకు లాగౌట్ చేసుకోవాలని ఆదేశించారు.
Also Read: Telangana, AP Rains News Live Updates: తెలంగాణ, ఏపీలో ఈ మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook