Sri Shakti Mahotsavam In Hyderabad: హైదరాబాద్‌లో తొలిసారిగా భారీ ఎత్తున శక్తి మహోత్సవాలు జరగనున్నాయి. ఆదివారం నుంచి ఈ నెల 23వ తేదీ సోమవారం వరకు ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 9-30 గంటల వరకు హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీపీ  వద్ద ఉన్న కైతలాపుర్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. దసరా పండుగ సందర్భంగా శక్తి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో శక్తి ఉత్సవాలు ఎప్పుడు జరగలేదని.. తొలిసారి భారీగా ఎత్తున నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాగ బ్రహ్మ హోతా సతీష్ కృష్ణ శర్మ బ్రహ్మత్వంలో జోతిష్య విద్యా విశారద ఆది వారాహి ఉపాశక లక్ష్మణ రావు గురూజీ ఆధ్వర్యంలో ప్రతీరోజు ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కమిటీ సభ్యులు. శ్రీ లక్ష్మి గణపతి హోమం, రుద్ర  యమలోక్త పాశుపత మహా మన్యు సూక్త పారాయణ హోమం, దశమహావిద్య హోమం, ఆదిత్యాది నవగ్రహ ఆరాధనా హోమం, చండీ హోమం, శ్రీ ఉచ్చిష్ట మహాగణపతి హోమం, శ్రీ సూక్త హోమం, సరస్వతి హోమం, సామూహిక అక్షరాభ్యాసాలు, నవదుర్గ పల్లకీ సేవలు, శ్రీ చక్రనవావరణ అర్చన, సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు, శ్రీదేవి, భూదేవి సమేత  శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణమహోత్సవం, కామ్యవృషోగజనమ్ (గో కళ్యాణం) మొదలైన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.  


తొమ్మిది రోజులపాటు ప్రత్యేక హిందూ సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ పూజ, దాండియా కోలాటాలు  వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రతీ రోజు బతుకమ్మ ఉయ్యాల పాటలతో గౌరీ దేవి పూజలు, ఉన్నత ప్రమాణాలు కలిగిన సంగీతంతో దాండియా, మన తెలుగు సాంస్కృతిక సంప్రదాయాలతో పాటు, కేరళ, కర్ణాటక, మహా రాష్ట్ర, బెంగాలీ, వంటి భిన్న సంసృతి కలిగిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో సినీ, టెలివిజన్ రంగానికి చెందిన పలువురు నటీనటులు, సినీ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా నిర్వహించేందుకు ప్రముఖ ఈవెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా భారీ ఎత్తున సన్నాహాలు చేస్తుందన్నారు.    


ప్రత్యేక పూజలు, హోమంలో పాల్గొనాలనుకునే వారు ముందుగా డిజిటల్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసుకుని టికెట్ పొందాలని కమిటీ సభ్యులు కోరారు. ఇతర వివరాలకు 84660 12345, 96660 26666 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. తమ వెబ్‌సైట్: www.srishakthimahotsavam.com సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.


Also read: Best Mileage Cars Under Rs 6 Lakhs: జస్ట్ 6 లక్షలకే వచ్చే బెస్ట్ మైలేజ్ కార్లు


Also Read: Motorola Edge 40 Neo Price: పిచ్చెకించే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Motorola Edge 40 Neo మొబైల్..డెడ్‌ చీప్‌ ధరకే మీ కోసం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook