YS Sharmila Slams KCR: హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జిత్తులమారి అని.. కేసీఆర్ పూటకో మాట - రోజుకో వేషం వేస్తారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీతో స్నేహం చేస్తోన్న దొర కేసీఆర్ వైఖరి "అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు" అన్న చందంగా ఉంటుంది అని మండిపడ్డారు. బీజేపి, కాంగ్రెస్.. ఈ రెండు పార్టీలతో కలిసి నటించే దొర సినిమాకు ఇచ్చే సర్టిఫికెట్ A/B అని ఎద్దేవా చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవసరానికి రంగులు మార్చే ఊసరవెల్లి కేసీఆర్ అని మండిపడిన వైఎస్ షర్మిల.. మీరు ప్రజల పక్షం అని చెప్పుకోవడానికి సిగ్గుండాలే అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు రుణమాఫీ అని చెప్పి 31 లక్షల మంది రైతులని మోసం చేసినందుకు మీరు రైతు పక్షపాతి అవుతారా అని లేక గచ 9 ఏళ్లలో 9 వేల మంది రైతులను బలి తీసుకున్నందుకు మీరు రైతుల పక్షం అవుతారా చెప్పాలి అని డిమాండ్ చేశారు. వరి వేస్తే ఉరి అని చెప్పిన మీరు రైతుల పక్షం ఎలా అవుతారు, చేతికొచ్చిన పంట నేలపాలైతే రూపాయి పరిహారం ఇవ్వని మీరు రైతుల పక్షం ఎలా అవుతారు ? అని వైఎస్ షర్మిల నిలదీశారు. 


" దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన మీరు ఆ మాట నిలపెట్టుకోకుండా దళితులను మోసం చేశారు. రిజర్వేషన్లు పెంచుతాం అని చెప్పి మైనార్టీల ఓట్లు దండుకుని వారిని కూడా మోసం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇస్తాం అని ఆశ చూపించి గిరిజనులను మోసం చేశారు. జనాభాలో అగ్రస్థానంలో ఉన్న బీసీలను సైతం మీ రాజకీయాలతో అణగదొక్కారు. మీ పాలనలో మోసపోని వర్గమే లేదు దొర " అంటూ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  



ఇది కూడా చదవండి : Brs Mla Durgam Chinnaiah: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా..: దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్


అన్నివర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన మీది ప్రజల పక్షం కాదు... ప్రజలను దోచుకు తినే దొంగల పక్షం.. ఇంకా చెప్పాలంటే జనాలను పట్టి పీడించే బీఆర్ఎస్ పార్టీది దొంగల పక్షమే అవుతుంది అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆత్మగౌరవం పేరు చెప్పి.. తన్ని తరిమేస్తారన్న చోటే రాజకీయం చేస్తోన్న మీరు తెలంగాణ ప్రజల పక్షం అంటే నమ్మెంత పిచ్చోళ్లు రాష్ట్రంలో ఎవ్వరూ లేరు అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యనించారు. ట్విటర్ ద్వారా షర్మిల ఈ ఆరోపణలు చేశారు. షర్మిల చేసిన ఈ ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎప్పటి తరహాలోనే లైట్ తీసుకుంటారా లేక తమ నాయకుడిని సమర్ధిస్తూ షర్మిలపై విమర్శలు ఎక్కుపెడతారా వేచిచూడాల్సిందే.


ఇది కూడా చదవండి : Telangana Congress Party: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK