Revanth Reddy: దోచుకున్న సొమ్ముతో కేసీఆర్ అక్కడికే పారిపోతారు.. రేవంత్ రెడ్డి సెటైర్స్

Revanth Reddy on KTR Delhi Tour: సీఎం కేసీఆర్‌కు దుబాయ్ అంటే ఇష్టమని.. రాష్ట్రంలో దోచుకున్న డబ్బుతో అక్కడికే పారిపోతారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను కాపాడుకునేందుకే మంత్రి కేటీఆర్ ఢిల్లీ గల్లీలో ప్రదిక్షణలు చేస్తున్నారని ఆరోపించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 25, 2023, 02:55 PM IST
Revanth Reddy: దోచుకున్న సొమ్ముతో కేసీఆర్ అక్కడికే పారిపోతారు.. రేవంత్ రెడ్డి సెటైర్స్

Revanth Reddy on KTR Delhi Tour: మంత్రి కేటీఆర్ ఢిల్లీ టూర్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కేసీఆర్ కేసీఆర్ కుర్చీ కదులుతుందనే.. ఢిల్లీలో కేటీఆర్ గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల్లో సీక్రెట్ ఆస్తుల వివరాలు దొరికాయని.. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని అన్నారు. ఆస్తుల వివరాలు మీడియాలో రాకుండా మెనేజ్ చేశారని పేర్కొన్నారు. కేటీఆర్ ఢిల్లీ టూర్ కంటోన్మెంట్ రోడ్లు, మెట్రో రైలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను కాపాడుకునేందుకు ప్రధాని మోదీకి కేసీఆర్ లొంగిపోయారని విమర్శించారు.

ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్‌ను ఎవరూ నమ్మరని రేవంత్ రెడ్డి అన్నారు. గత 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. 100 కోట్ల లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై విచారణ చేయిస్తున్న మోదీ.. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్‌పై ఎందుకు విచారణ జరిపించడం లేదని నిలదీశారు. కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చిన మోదీ.. కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో మంత్రులు, ఆప్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో ఈడీ వరుసగా దాడులు నిర్వహిస్తున్నా.. ఒక్కరిని కూడా ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ బంధం అనుకుంటే తెగిపోయేది కాదని.. ఫెవికాల్ బంధం అంటూ కామెంట్స్ చేశారు.

బీఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేనని.. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి తమతోనే సాధ్యమన్నారు. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దామని పిలుపునిచ్చారు. అందరూ కలిసి రావాలని కోరారు. తెలంగాణను ఆఖరికి రోడ్లు అమ్ముకునే దుస్థితి కేసీఆర్ తీసుకువచ్చారని విమర్శించారు. కేసీఆర్‌కు దుబాయ్ అంటే చాలా ఇష్టమని.. దోచుకున్న డబ్బులతో అక్కడికే పారిపోతారని అన్నారు. కేసీఆర్‌ ఢిల్లీ బీజేపీ నమ్మేపరిస్థితిలో లేదని.. అందుకే కేటీఆర్ ఢిలీ పర్యటనకు వెళ్లారని పేర్కొన్నారు. మరోవైపు అధిష్టానం పిలుపుతో రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

Also Read: Shriya Saran:  అందాల బాంబ్ పేల్చిన శ్రియా.. ఉర్పీ జావేద్ కాపీ అంటూ ట్రోలింగ్

Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News