కరోనా వైరస్ (CoronaVirusEffect) అన్ని రంగాలను దెబ్బ తీస్తోంది. ఉద్యోగాలు కోల్పోవడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిసిందే. ఏప్రిల్ నెల నుంచి దాదాపు 1.89కోట్ల మంది ఉద్యోగాలు (Corona Effect On Employment) కోల్పోయారట. అందులో జులై నెలలోనే 50 లక్షల మంది నిరుద్యోగులు అయ్యారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (CMIE) డేటా చెబుతోంది. కరోనా దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక సమస్యలతో పాటు ఆకలి కష్టాలు రెట్టింపయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాక్‌డౌన్, కరోనా దెబ్బకు ఏప్రిల్ నెలలో ఏకంగా 1.77కోట్ల మంది ఉద్యోగాలు (Salaried jobs) కోల్పోయారు. మే నెలలో మరో లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. జూన్‌లో 39 లక్షల మందిని జాబ్స్ నుంచి తొలగించినట్లు సీఎంఐఈ వెల్లడించింది. నెల నెలా క్రమ పద్ధతిలో శాలరీ అందుకునే వారు ఉద్యోగాలు కోల్పోతే తిరిగి సంపాదించడం అంత సులువుకాదని, బయట పరిస్థితి అంత మంచిగా లేదని సీఎంఐఈ సీఈవో మహేశ్ వ్యాస్ చెప్పారు. Rajiv Gandhi Birth Anniversary: నాన్నకు ప్రేమతో.. రాహుల్ గాంధీ ట్వీట్


వీరితో పాటు రోజువారీ ఏదో పని చేసుకుని జీవనం సాగిస్తున్న 68 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సర్వే చెబుతోంది. 1.49కోట్ల మంది కొత్తగా వ్యవసాయం పనులు మొదలుపెట్టడం గమనార్హం. కొన్ని కంపెనీలు తమకు పరిష్కారం చూపించాలంటూ ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ప్రభుత్వ పనులు సగం మేర ఆగిపోయి నష్టాలు వస్తున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 
Jiya Roy Hot Stills: బెంగాల్ బ్యూటీ జియా రాయ్ ట్రెండింగ్ ఫొటోలు