Maharashtra: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. పది మంది శిశువుల మృతి
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి ఐసీయూలో మంటలు చెలరేగడంతో పదిమంది శిశువులు మరణించారు.
10 children killed in fire breaks | భండారా: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి ఐసీయూలో మంటలు చెలరేగడంతో పదిమంది శిశువులు మరణించారు. ఈ విషాదకర సంఘటన (Maharashtra) భండారా జిల్లా జనరల్ హాస్పిటల్‌లో సంభవించింది. ఆసుపత్రిలోని సిక్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (SNCU) లో శనివారం తెల్లవారుజామున 2గంటలకు మంటలు (fire accident) చెలరేగాయి. ఈ ఘటనలో పది మంది (10 children killed) మరణించారు. మరో ఏడుగురు చిన్నారులను ఆసుపత్రి సిబ్బంది రక్షించినట్లు ఆసుపత్రి సివిల్ సర్జన్ ప్రమోద్ ఖండతే పేర్కొన్నారు. Also Read: AP Local body elections 2021 Schedule: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
అయితే ప్రమాదం జరిగిన సమయంలో (Bhandara District General Hospital) ఐసీయూలో 17 మంది చిన్నారులు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సుమారు రాత్రి 2గంటల సమయంలో డ్యూటీలో ఉన్న ఓ నర్స్ గదిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించి వెంటనే అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించినట్లు సమాచారం. అయితే (Bhandara hospital fire) ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also read: Pakistan: ఉగ్రవాది లఖ్వీకి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన పాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook