Pakistan: ఉగ్రవాది లఖ్వీకి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన పాక్

26/11 ముంబై ఉగ్రదాడి కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఉగ్రవాది జకీఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీ (Zakiur Rehman Lakhvi) కి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు 15ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2021, 05:03 PM IST
  • 26/11 ముంబై ఉగ్రదాడి కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఉగ్రవాది జకీఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీ (Zakiur Rehman Lakhvi) కి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు 15ఏళ్ల జైలు శిక్ష విధించింది.
  • ఈ మేరకు ఆ దేశ (Pakistan) మీడియా శుక్రవారం పలు కథనాలను ప్రసారం చేసింది.
Pakistan: ఉగ్రవాది లఖ్వీకి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన పాక్

Lashkar-e-Taiba militant lakhvi jailed for 15 years | న్యూఢిల్లీ : 26/11 ముంబై ఉగ్రదాడి కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఉగ్రవాది జకీఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీ (Zakiur Rehman Lakhvi) కి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు 15ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు ఆ దేశ (Pakistan) మీడియా శుక్రవారం పలు కథనాలను ప్రసారం చేసింది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై లష్కరే తోయిబా, అల్-ఖైదా ఉగ్రవాద సంస్థల్లో కీలకంగా వ్యవహరిస్తున్న రెహ్మాన్ లఖ్వీని కొన్ని రోజుల కిందట పాక్‌ ఉగ్రవాద వ్యతిరేక పోలీస్‌ విభాగం (CTD) అరెస్టు చేసింది. Also Read: Ancient Temple: పాకిస్తాన్‌లో 1,300 ఏళ్ల నాటి హిందూ దేవాలయం

ఈ మేరకు అతనిపై లాహోర్ పోలీస్ స్టేషన్‌లో సీటీడీ కేసు నమోదు చేసి.. పాక్ ఉగ్రవాద నిరోధక కోర్టు (Pakistan's Anti Terrorism Court)లో హాజరుపరిచినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ముంబై దాడుల తర్వాత ఐక్యరాజ్యసమితి లఖ్వీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అనంతరం లఖ్వీని పాక్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆరు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం.. 2015లో రావల్పిండి జైలు నుంచి (Terrorist) లఖ్వీ బెయిల్‌పై విడుదలయ్యాడు. Also Read: Indian Army: సరిహద్దుల్లో రహస్య సొరంగం గుర్తింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News