ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 1024 కేసులు నమోదు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. లాక్‌డౌన్ 4.0లో ( Lockdown exemptions ) ఇచ్చిన మినహాయిపులు భారీ మూల్యాన్నే చెల్లించుకొనేలా చేస్తున్నాయి. ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య ( COVID-19 positive cases in Delhi ) చాలా వేగంగా పెరుగుతోంది.
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ ( Coronavirus ) విజృంభిస్తోంది. లాక్‌డౌన్ 4.0లో ( Lockdown exemptions ) ఇచ్చిన మినహాయిపులు భారీ మూల్యాన్నే చెల్లించుకొనేలా చేస్తున్నాయి. ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య ( COVID-19 positive cases in Delhi ) చాలా వేగంగా పెరుగుతోంది. తాజాగా గురువారం ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన హెల్త్ బులెటిన్ ( COVID-19 health bulletin ) ప్రకారం ఒక్కరోజులో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య ఏకంగా వెయ్యి దాటేసింది. గురువారం ఢిల్లీలో 1,024 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదైన కేసులతో కలిపి ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,281కి చేరింది. ( Read also : ఉచ్చుకు చిక్కిన చిరుత.. అటవీ శాఖ సిబ్బందిపై దాడి.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు )
గురువారం 231 మంది కరోనా నుంచికోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం 8,470 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు నేడు 13 మందితో కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటివరకు ఢిల్లీలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 316 కి చేరుకుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..