LPG cylinder blasted: ఎల్పీజీ సిలిండర్ పేలి 17 మందికి గాయాలు, 5 ఇళ్లు ధ్వంసం
LPG cylinder blasted: ఎల్పీజీ సిలిండర్ పేలుడు (LPG cylinder explosion) ధాటికి ఐదు నివాసాలు ధ్వంసమయ్యాయి. నాలుగు ఫైర్ ఇంజన్స్ ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది ఏంటంటే..
LPG cylinder blasted: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలి ఐదు ఇళ్లు ధ్వంసం అవడంతో పాటు 17 మందికి గాయాలైన ఘటన ఢిల్లీలోని ఆజాద్ నగర్‌లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదర్శ్ నగర్ పోలీసు స్టేషన్‌కు ఉదయం 10.08 గంటలకు పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది. ఆజాద్‌పూర్‌లోని లాల్‌బాగ్ మసీదు సమీపంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్టు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.
పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అక్కడ ఈ దుర్ఘటనలో 17 మంది గాయాలపాలైనట్టు తెలిసింది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. అందులో 16 మందిని బాబు జగ్జీవన్ రామ్ ఆస్పత్రికి తరలించగా మరొకరిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి (RML Hospital) తరలించడం జరిగింది.
Also read : Assam Rifles: భార్యతో ఆ జవాన్ చివరి ఫోన్ కాల్.. దాడికి కొద్ది గంటల ముందు ఏం చెప్పాడంటే
ఎల్పీజీ సిలిండర్ పేలుడు (LPG cylinder explosion) ధాటికి ఐదు నివాసాలు ధ్వంసమయ్యాయి. నాలుగు ఫైర్ ఇంజన్స్ ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది ఏంటంటే.. అక్కడి భవనంలోని మూడో అంతస్తులో ఉన్న ఒక ఇంట్లో పప్పూ కుమార్ అనే వ్యక్తి గ్యాస్ సిలిండర్ (LPG cylinder) మార్చుతుండగా పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడు ధాటికి అతడి ఇంటి పై కప్పు, గోడలు కూలిపోయాయి. ఇదే పేలుడు ధాటికి రెండో అంతస్తులోని మరో నాలుగు ఇళ్లు కూడా కుప్పకూలాయని పోలీసులు తెలిపారు.
Also read : Patan Girl Tonsured: ప్రేమికుడితో వెళ్లిపోయిన బాలికకు గుండుకొట్టించిన గ్రామస్థులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook