23 Soldiers Missing In Sikkim Flash Floods: ఉత్తర సిక్కింలో భారీ వరదలు సంభవించాయి. దీని కారణంగా 23 మంది ఆర్మీ సైనికలు గల్లంతు తయ్యారని రక్షణ శాఖ వెల్లడించింది.  ఉత్తర సిక్కింలోని లొనాక్ నది పొంగడం వల్ల అకస్మాత్తుగా వరదలు సంభవించాయని తెలుస్తోంది. గల్లంతైన జవాన్ల కోసం రక్షణ శాఖ గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. ఈ ఘటన అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో జరిగింది. నది పరివాహాక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరద పరిస్థితి గురించి సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్  సమీక్షించారు. చుంగ్తాంగ్ ఆనకట్ట నుంచి అకస్మాత్తుగా నీటిని విడుదల చేయడం వల్ల దిగువన 15 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది. దీని కారణంగానే వరదలు సంభవించాయని అధికారులు తెలిపారు. అయితే ఈ వరదలకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



గౌహతిలోని డిఫెన్స్ పీఆర్వో మాట్లాడుతూ..'ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై అకస్మాత్తుగా వరదల కారణంగా 23 మంది సైనికులు గల్లంతయ్యారని తెలిపారు. చుంగ్‌తంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో దిగువన నీటి మట్టం ఒక్కసారిగా 15 నుంచి 20 అడుగుల ఎత్తుకు చేరుకోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. దీంతో సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలను ఒక్కసారిగా వరద ముంచెత్తిందన్నారు. దీని కారణంగా 23 మంది సైనికులు గల్లంతు కాగా.. 41 వాహనాలు వరదలో మునిగిపోయాయని తెలిపారు. 


ఈ ఘటనపై బిజెపి నాయకుడు ఉగ్యెన్ త్సెరింగ్ గ్యాత్సో భూటియా కూడా స్పందించారు. ప్రభుత్వం గల్లంతైనా ఆర్మీ జవాన్ల కోసం అన్ని రకాల సహాయక చర్యలు చేపడుతోందన్నారు. ఇప్పటివరకు వరదల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారు. సింగ్‌టామ్‌ ప్రాంతంలో మాత్రం ప్రభుత్వ ఆస్తులకు నష్టం జరిగిందని తెలిపారు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి