Odisha Mayurbhanj: విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. ఒడిశా(Odisha)లోని మయూర్‌భంజ్‌ జిల్లా(Mayurbhanj District)లో 26 మంది విద్యార్థినులు కొవిడ్(Covid-19) బారిన పడ్డారు. థాకుర్‌ముండాలోని చమక్‌పూర్ గిరిజన రెసిడెన్షియల్ బాలికల పాఠశాల(residential school)లో ఈ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 259 మంది విద్యార్థినులు, 20 మంది సిబ్బంది ఉన్న ఈ పాఠశాలలో పెద్ద ఎత్తున కేసులు బయటపడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Dharwad Medical College Covid: ఒకే కాలేజీలో 281 మంది విద్యార్థులకు కరోనా..


కరోనా సోకిన విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోని ఐసోలేషన్(Isolation)లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే.. వెంటనే బాధితులను తరలించేందుకు వీలుగా పాఠశాల వద్ద అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. పాఠశాలకు వస్తున్న కొందరు బాలికలు స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు టీచర్లు గమనించారు. బాధిత విద్యార్థినులకు గత గురువారం కరోనా పరీక్షలు(Covid Tests) నిర్వహించగా.. 26 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు వెల్లడైంది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook