Dharwad Medical College Covid Cases: కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాకు చెందిన ఎస్డీఎమ్ మెడికల్ కాలేజీలో ఏకంగా 281 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. కొత్తగా 99 మందికి కొవిడ్ సోకినట్లు తేలిందని జిల్లా కలెక్టర్ నితీశ్ పాటిల్ తెలిపారు. ఇంకా మరో 1,822 మంది శాంపిల్స్ రిజల్ట్ రావాల్సి ఉందని వెల్లడించారు.
అయితే కరోనా సోకిన 281 మంది విద్యార్థుల్లో కేవలం ఆరుగురిలో మాత్రమే కొవిడ్ లక్షణాలు కనిపించాయని.. మిగతా వారికి ఎలాంటి లక్షణాలు లేవన్నారు. అయితే వీరందరూ పూర్తిగా టీకాలు వేసుకున్న వారేనని వివరించారు. ప్రస్తుతం విద్యార్థులందరినీ క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.
ఆ పార్టీనే కారణమా?
కాలేజీలో నవంబరు 17న జరిగిన ఫ్రెషర్స్ పార్టీనే కరోనా విజృంభణకు కారణమని వైద్యాధికారి నితేశ్ కె. పాటిల్ ఇదివరకే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు. విద్యార్థుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. ఇప్పటికే క్యాంపస్‌లోని రెండు హాస్టళ్లను అధికారులు శానిటైజ్ చేయించారు.
Also Read: Jaipur: ఫైవ్ స్టార్ హోటల్‌లో భారీ చోరీ..2 కోట్ల విలువైన ఆభరణాలు, 95వేల నగదు అపహరణ..
Also Read: Rape and Murder: ఖాళీ భవనంలో కుళ్లిపోయిన స్థితిలో యువతి మృతదేహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook