Manipur violence Update: మణిపూర్‌లో మరోసారి హింస (Manipur violence) చెలరేగింది. శనివారం తెల్లవారుజామున బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ముగ్గురు మరణించారు. కుకీ (Kuki) వర్గానికి చెందిన పలు ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి (Houses burnt). మృతులను క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి (Meitei community) చెందినవారని పోలీసులు గుర్తించారు. కొందరు వ్యక్తులు బఫర్ జోన్‌ను దాటి మెయిటీలు ఉండే ప్రాంతాలకు వచ్చి వారిపై కాల్పులకు తెగబడ్డారని వారు తెలిపారు. ఘటనా స్థలానికి 2 కిలోమీటర్ల దూరంలో భద్రతా దళాలు ఉన్నాయని.. ప్రస్తుతం ఆ ప్రాంతం పూర్తిగా తమ అదుపులో ఉందని అధికారులు తెలిపారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ గత కొన్ని నెలలుగా రావణకాష్టంలా రగులుతోంది. ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 160 మందికిపైగా మరణించగా.. వందలాది మంది గాయపడ్డారు. రెండు రోజుల కిందట బిష్ణుపూర్ జిల్లాలో సాయుధ బలగాలకు, మైటీ తెగ నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ ఘర్షణల్లో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా..  అధికారులు పగటిపూట ఆంక్షలు విధించారు. మూడు నెలల కిందట మణిపుర్‌లో ఈ రెండు తెగల మధ్య ఇదే స్థాయిలో హింస చెలరేగింది. 


Also Read: Kulgam Encounter: మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook