Earthquake today: లడఖ్, కశ్మీర్‌ల్లో స్వల్ప భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం..
Earthquake today: కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్, జమ్ముకశ్మీర్‌లో భూమి కంపించింది. ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 4.5, 3.7 తీవ్రతతో నమోదయ్యాయి.
Earthquake in Ladakh and Jammu and Kashmir: కేంద్ర పాలిత ప్రాంతాలైన లడఖ్(Ladakh), జమ్ముకశ్మీర్‌లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మంగళవారం తెల్లవారుజామున 4:33 గంటల సమయంలో లడఖ్‌లోని లేహ్‌లో (Leh) భూమి కంపించింది. ఇది రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూకంప కేంద్రం 5 కి.మీ లోతులో ఉంది.
అదేవిధంగా జమ్మూకశ్మీరులోని కిష్త్వార్ జిల్లాలోనూ (Kishtwar) భూమి స్వల్పంగా కంపించింది. మంగళవారం అర్ధరాత్రి 1.10 గంటలకు 3.7 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. దీని భూకంపం కేంద్రం కూడా 5 కి.మీ లోతులో ఏర్పడినట్లు NCS వెల్లడించింది. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియరాలేదు.
చైనాలో భారీ భూకంపం
ఈ వారం ప్రారంభంలో చైనాలో కూడా భారీ భూకంపం సంభవించింది. డిసెంబరు 18వ తేదీన వాయువ్య చైనాలో 6.2 తీవ్రతతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 149కి చేరింది. ఒక్క గన్సు ప్రావిన్స్‌లోనూ 117 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 781 మంది గాయపడ్డారు. ఇందులో గాయపడిన 500 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Also Read: Ayodhya Rammandir: అయోధ్యలో ఆకాశాన్నంటుతున్న ధరలు, రూమ్ గది రోజుకు లక్ష రూపాయలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook