Ayodhya Rammandir: అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం కొత్త ఏడాదిలో జనవరి 22న ప్రారంభం కానుంది. రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. ప్రధాని మోదీ సహా ప్రముఖులంతా హాజరుకానున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
దేశంలో హిందూవులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామమందిరం జనవరి 22న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. దేశ విదేశాల్నించి ప్రముఖులు, భక్తజనం తరలి రానున్నారు. లక్షలాది సంఖ్యలో భక్తులు అయోధ్య చేరుకుంటారని అంచనా. ఈ నేపధ్యంలో భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇటు రవాణా అటు వసతి సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జనవరి 22వ తేదీకు ముందు నుంచే అయోధ్యకు భక్తుల తాకిడి పెరగనుంది. మూడంచెల భద్రత సైతం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క భక్తుడిని నిశితంగా పరిశీలించిన తరువాతే మందిరంలోనికి అనుమతి ఉంటుంది. మరోవైపు ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపధ్యంలో ఏర్పాట్లు పగడ్బందీగా చేస్తున్నారు.
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ ప్రభావం ముఖ్యంగా నగరంలోని హోటళ్లపై పడింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌తో హోటల్స్ నిండిపోయాయి. డిమాండ్ కారణంగా హోటల్ రూం ఒక్కొక్కటి లక్ష రూపాయలు పలుకుతోంది. డిమాండ్ ఉన్నప్పుడే కదా ధర పెంచేందంటున్నారు హోటల్ యాజమానులు. నగరంలో హోటల్స్ సంఖ్య తక్కువ కావడం ఇందుకు ప్రధాన కారణం. స్టార్ హోటల్స్ అయితే 3-4 కంటే ఎక్కువ లేవు. రోజుకు లక్ష రూపాయలు హోటల్ రూం ధర ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కేవలం హోటల్ రూమ్స్ ఒక్కటే కాదు..అయోధ్యకు ప్రయాణం కూడా చాలా భారంగా మారిపోయింది బస్, ఫ్లైట్ టికెట్లు ఖరీదయ్యాయి.
Also read: Hardik Pandya Deal: హార్దిక్ పాండ్యా గుజరాత్ టు ముంబై వెనుక చేతులు మారిన కోట్ల రూపాయలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Ayodhya Rammandir: అయోధ్యలో ఆకాశాన్నంటుతున్న ధరలు, రూమ్ గది రోజుకు లక్ష రూపాయలు