Ex Gratia Amount to COVID-19 victims kin: దేశంలో కరోనా మరణాలు దాదాపు నాలుగు లక్షల మరకు సంభవించాయి. కరోనా మరణాలు సంభవించిన కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవపు సుప్రీంకోర్టు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని దీనిపై ప్రశ్నించగా.. కరోనా వైరస్‌ బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్19తో మరణించిన వారి కుటుంబసభ్యులకు పరిహారం చెల్లించాల్సి వస్తే ఇక విపత్తు సహాయ నిధులు (SDRF) మొత్తం వారికే కేటాయించాల్సి వస్తోందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఓ అఫిడవిట్‌లో ఈ వివరాలు పేర్కొంది. ఆ కుటుంబాలకే మొత్తం నిధులు కేటాయిస్తే, విపత్తులు, అత్యవసర వైద్య సేవలు, వరదలు సంభవిస్తే సహాయక చర్యలు లాంటి విషయాలకు ఖజానాలో ఏం మిగలదని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి నిధులు సమకూర్చలేవని తెలిపింది. కోవిడ్19 (Delta Plus Variant of COVID-19) బాధిత కుటుంబాలకు పరిహారం కోరుతూ లాయర్లు రీపక్ కన్సాల్ మరియు గౌరవ్ కుమార్ బన్సాల్ దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. 


Also Read: SBI Customers Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు సరికొత్త సౌకర్యం, ఏ ఛార్జీలు వసూలు చేయరు


ఒకవేళ కరోనా సోకి మరణించిన వారి కుటుంబసబ్యులకు పరిహారం చెల్లిస్తే ఇతర వ్యాధుల బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు కూడా చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. కేవలం ఒక్క వ్యాధి బాధితులకు మాత్రమే చెల్లించి ఇతర బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించకపోవడం సరికాదని అభిప్రాయపడింది. ప్రకృతి వైపరిత్యాలకు మాత్రమే విపత్తు సహాయం లాంటివి వర్తిస్తాయని, కరోనా వైరస్ (Indian Covid-19 Variants) మృతుల తరహాలో ప్రతి విషయంలోనూ పరిహారం చెల్లించడం అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.


Also Read: Fathers Day 2021 Wishes: తమ హీరోలకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్ సెలబ్రిటీలు


కోవిడ్-19 బారిన పడి చనిపోయిన వారికి వైద్యశాఖాధికారులు ఎలాంటి పోస్టుమార్టం నిర్వహించడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. వాళ్లు ఏ కారణంతో చనిపోయారో కనీసం చనిపోయిన వారి కుటుంబసభ్యులకు లేదా వారి సన్నిహితులకు తెలియాలని, అధికారికంగా డాక్యుమెంట్స్ ఉండాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook