Airports Bomb Threats: బాంబు బెదిరింపులు దేశంలో ఎక్కడో ఒక చోట భయాందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలకు నిత్యం ఈ బెదిరింపుల ముప్పు ఉండగా.. తాజాగా దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌ పోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. దీంతో విమానయాన రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మొత్తం విమానశ్రయాలను జల్లెడ పట్టి వెతికారు. బాంబుల కోసం వెతకగా ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే తప్పుడు ఫోన్‌ కాల్‌గా పోలీసులు భావించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chennai: యువకుడి ప్రాణం తీసిన వైఎస్సార్‌సీపీ ఎంపీ కుమార్తె.. కారుతో చెన్నైలో హల్‌చల్‌


దేశవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్‌ వచ్చాయి. హైదరాబాద్‌, చెన్నై, కోయంబత్తూరు, పాట్నా, వడోదర, జైపూర్‌తో సహా మొత్తం 41 విమానశ్రయాలకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు. అణువణువు పరిశీలించడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. భద్రతా దళాలు విస్తృతంగా తనిఖీలు చేయడంతో ఏం జరుగుతుందో తెలియక భయపడ్డారు.

Also Read: Uppal Stadium: ఊపిరి పీల్చుకున్న ఉప్పల్‌ స్టేడియం.. కోట్లలో ఉన్న కరెంట్‌ బిల్లులు చెల్లింపు


గతంలో ఇలా చాలా
కాగా కొన్ని రోజుల కిందట కూడా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయానికి ఇలాంటి బాంబు బెదిరింపు ఈమెయిల్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి టొరంటోకు వెళ్తున్న కెనడా విమానంలో బాంబు ఉందని 13 ఏళ్ల బాలుడు బెదిరింపు మెయిల్‌ చేశాడు. ఆ సమయంలో పోలీసులు, భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టులో విస్తృతంగా తనిఖీలు చేసి బాంబు లేదని నిర్ధారించారు. అనంతరం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా బెదిరింపు ఈ మెయిల్ చేసిన బాలుడిపై పోలీసులు చర్యలు తీసుకున్నారని సమాచారం.



 








స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter