43 మందిని బలిగొన్న పిడుగులు, భారీ వర్షాలు..
lightning strikes | ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాలు ఆ రాష్ట్రాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం పిడుగులు పడి ఆయా రాష్ట్రాల్లో 43మంది మరణించగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
lightning strikes: న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, బిహార్‌లో ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం ఆయా రాష్ట్రాల్లో పిడుగులు పడి ( lightning strikes ) 43మంది మరణించగా.. అనేక మంది గాయాలపాలయ్యారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. Also read: India vs China: భారత్, చైనా వివాదంలో జోక్యం చేసుకోలేమన్న రష్యా
ఉత్తరప్రదేశ్ (uttar pradesh) రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు పడటంతో 23మంది మృతిచెందగా, దాదాపు 29మంది గాయాలపాలయ్యారు. అత్యధికంగా ప్రయాగ్‌రాజ్ జిల్లాలో 8మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. బిహార్ (bihar) రాష్ట్రంలో పిడుగుల కారణంగా 20మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. అత్యధికంగా భోజ్‌పూర్ జిల్లాలో తొమ్మిది మంది మరణించారు. Also read: ajay devgn: బిగ్ స్క్రీన్‌పై.. గాల్వన్ వీరుల శౌర్యం..
4లక్షల ఎక్స్‌గ్రేషియా: సీఎం నితీష్ కుమార్..
పిడుగుల కారణంగా బిహార్‌లో 20మంది మృతిచెందడం పట్ల సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మరణించిన వారి ప్రతి కుటుంబానికి రూ .4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఇదిలాడఉంటే.. బిహార్‌లోకి రుతుపవనాలు ప్రవేశించిన నాటినుంచి పిడుగుల కారణంగా ఇప్పటివరకు సుమారు 130 మంది మరణించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..