Bank employees salaries, DA hike under 7th Pay Commission: న్యూ ఢిల్లీ: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు మాత్రమే కాకుండా బ్యాంకు ఉద్యోగులకు కూడా ఓ గుడ్ న్యూస్ (Good news) రానుంది. ఆగస్టు 2021 నుంచి బ్యాంకు ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయా అంటే అవుననే తెలుస్తోంది. అందుకు కారణం వాళ్ల డియర్నెస్ అలవెన్స్  27.79 శాతం పెరగడమే. అవును, న్యూస్ 18 ప్రచురించిన ఓ వార్తా కథనం ప్రకారం వాళ్ల డియర్నెస్ అలవెన్స్  27.79 శాతం పెరిగినట్టు సమాచారం. గత త్రైమాసికం కంటే ఈ పెంపు 2.1 శాతం అధికం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11వ బిపిఎస్ శాలరీ స్ట్రక్చర్ ప్రకారమే ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య అందుకునే జీతాలకు ఈ పెంపు వర్తించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాంకింగ్ రంగంలో ఉన్న 8 లక్షలకుపైగా ఉద్యోగులకు ఈ డియర్‌నెస్ అలవెన్స్ పెంపు లబ్ధి (DA hike benefits) అందుకోనున్నారు. 


Also read : PMUY scheme: పిఎంయువై స్కీమ్: ఉజ్వల 2.0 తో నిరుపేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్స్


ప్రభుత్వ ఉద్యోగులకు, బ్యాంకు ఉద్యోగులకు తమ జీతంలో ఒక భాగంగా ఈ డియర్‌నెల్ అలవెన్స్ ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, బ్యాంకు ఉద్యోగులకు ఎప్పటికప్పుడు అప్పటి కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ప్రతీ మూడు నెలలకు ఒకసారి డియర్‌నెస్ అలవెన్స్ (DA hike) సవరించడం జరుగుతుందనే సంగతి తెలిసిందే.


అర్బన్ సెక్టార్, సెమీ అర్బన్ సెక్టార్, రూరల్ సెక్టార్ ప్రాంతాల వారీగా ఉద్యోగి పని చేసే ప్రాంతాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ (Cost of living) ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్ క్యాలిక్యులేట్ (DA caliculations) చేస్తారు. 


Also read: EV registration fee: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. ఇక నో రిజిస్ట్రేషన్ ఫీ, రెన్యూవల్ ఫీ


2017 నవంబర్ 1 తర్వాత రిటైర్ అయిన బ్యాంకు ఉద్యోగులకు అందే పెన్షన్‌పై 27.79 డియర్‌నెస్ రిలీఫ్ అందుకోనున్నారు. బ్యాంకు ఎంప్లాయిస్ పెన్షన్ రెగ్యులేషన్ యాక్ట్ (Bank Employees’ Pension Regulations) ప్రకారం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌లో (IBA banks) సభ్యులుగా ఉండి రిటైర్ అయిన వారికి డియర్‌నెస్ రిలీఫ్ ప్రయోజనాలు (DR benefits) అందనున్నాయి.


Also read : EPFO Medical advance: ఈపీఎఫ్ నుంచి లక్ష రూపాయలు మెడికల్ అడ్వాన్స్ తీసుకునే అవకాశం..ఎలాగంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook