7th Pay Commission Latest News: డీఏ పెంపునకు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 5 కీలక నిర్ణయాలు ఇవే

ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance), డీఆర్ పెంపు వివరాలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిన్నర కాలం నుంచి ఆరు నెలలకు సవరించే తమ డీఏ, డీఆర్ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు. నిత్యం పెరిగే ధరలకు అనుగుణంగా తమ డీఏ పెంపు, డీఆర్ సవరింపు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
  • Jul 09, 2021, 11:00 AM IST

7th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (Dearness Allowance), డీఆర్ పెంపు వివరాలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిన్నర కాలం నుంచి ఆరు నెలలకు సవరించే తమ డీఏ, డీఆర్ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు. నిత్యం పెరిగే ధరలకు అనుగుణంగా తమ డీఏ పెంపు, డీఆర్ సవరింపు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

1 /5

జూన్ 2020లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన పథకం హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (House Building Advance). అతి తక్కువ వడ్డీ ధరలకే ఉద్యోగులకు ఈ పథకం తీసుకొచ్చి సొంతింటి కలను సాకారం చేస్తుంది. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ పథకం కింద 7.9 శాతం వడ్డీకి రుణాలు అందిస్తుంది. ఇందులో రుణాలు పొందడానికి దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 31, 2022.

2 /5

Travel Allowance Claims Extended: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ లాంటి నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ట్రావెల్ అలవెన్స్ క్లెయిమ్స్‌ను 180 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఈ గడువు కేవలం రెండు నెలలు మాత్రమే. అంటే 60 రోజుల్లోనే వారు ట్రావెల్ అలవెన్స్ క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉండేది.

3 /5

కోవిడ్19 నిబంధనలు, కరోనా ఆంక్షల నేపథ్యంలో పెన్షనర్ల సమస్యను అర్థం చేసుకుని సులువగా పెన్షన్ స్లిప్ వారికి అందేలా చర్యలు చేపట్టింది. పింఛన్‌దారులకు మెస్సేజ్, ఈమెయిల్, లేదా వాట్సాప్ సందేశాల రూపంలో రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు పెన్షన్ స్లిప్ అందించడానికి నిర్ణయం తీసుకుంది. 

4 /5

జాతీయ పెన్షన్ విధానం (National Pension System)లో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని మార్పులు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా ప్రయోజనాలు పొందనున్నారు. పాతన పెన్షన్ విధానం (Old Pension Scheme) ద్వారా పెన్షన్ కార్పస్ అవకాశాన్ని కల్పించింది.

5 /5

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నవోదయ విద్యాలయ సమితి (Navodaya Vidyalaya Samiti)లోని సిబ్బందికి గతంలో రూ.5వేల వరకు మాత్రమే ప్రిన్సిపల్ మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు అనుమతి ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిమితిని రూ.25 వేలకు పెంచారు. గతంలో అయితే రూ.5 వేల పరిమితి దాటితే ప్రాంతీయ కార్యాలయంలో మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలని నియమం ఉండేది.