న్యూ ఢిల్లీ: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. 7వ పే కమిషన్ చేసిన సూచనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 వ్యాప్తికి ముందు వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 21 శాతం డియర్‌నెస్ అలవెన్స్ వర్తించగా కొవిడ్-19 కారణంగా డిఏను 17 శాతానికి తగ్గించారు. వచ్చే ఏడాది జూన్ వరకు ఇదే విధానం అమలులో ఉండనుండగా ఆ తర్వాత మళ్లీ కేంద్రం డియర్‌నెస్ అలవెన్స్ ( Dearness allowance ) విధానాన్ని సవరించి వారి డిఏ శాతాన్ని పెంచనుంది. ఈ కారణంగానే వచ్చే ఏడాది జూన్ తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. ప్రతీ సంవత్సరం జూలై నెలలో డియర్‌నెస్ అలవెన్స్‌లను సవరిస్తున్న సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus pandemic ) కారణంగా ఎదురైన ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు ఈ ఏడాది డియర్‌నెస్ అలవెన్స్ శాతాన్ని తగ్గించిన కేంద్రం.. ఆ తర్వాత 30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్ అందించింది. అంతేకాకుండా ఎల్టీసీ, ఎల్టీఏలనూ పెంచింది. డిఏ తగ్గిందన్న నిరుత్సాహంతో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపేందుకే కేంద్రం అప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. ఎల్టీసీ క్యాష్ ఓచర్ స్కీమ్‌ ( LTC cash voucher scheme ) శాతాన్ని సైతం పెంచినట్టు కేంద్రం అక్టోబర్ 12న వెల్లడించింది. 


Also read : SBI alert: ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక.. అప్రమత్తం కాకుంటే అంతే సంగతి!


కేంద్రం తరహాలోనే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఏ శాతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పెరిగిన డిఏ ఫలాలు ( DA benefits ) అందనున్నాయి.


Also read : Also read : How to apply for MUDRA loan: ముద్ర లోన్‌కి ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook