7th Pay Commission Update: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూలైలో కొత్త ఫార్ములాతో పెరగనున్న DA
7th Pay Commission Latest Update: జూలైలో నిర్వహించే డియర్‌నెస్ అలవెన్స్ ఫార్ములాలో మార్పు ఉండవచ్చు, AICPI ఇండెక్స్ యొక్క రెండు నెలల గణాంకాలు వచ్చాయి, దీనిని చూస్తుంటే డియర్‌నెస్ అలవెన్స్ 3 శాతం పెరుగుతుందని అంటున్నారు.
7th Pay Commission Latest News April 2023: డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)కి సంబంధించి మరో కొత్త అప్‌డేట్ తెర మీదకు వచ్చింది. మార్చిలో డీఏ పెంచిన తర్వాత ఇప్పుడు జులైలో మరో డీఏ ప్రకటించనున్నారని తెలుస్తోంది. DA హైక్ క్యాలిక్యులేషన్ ఫార్ములా ఈ జూలైలో మార్చవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్ లభిస్తోంది. ఇటీవల డీఏ 4 శాతం పెరిగింది. ఇప్పుడు ఉద్యోగులకు ఏప్రిల్ జీతం నుండి పెరిగిన డీఏ ప్రయోజనాలు లభిస్తాయి. జులైలో నిర్వహించే డియర్‌నెస్ అలవెన్స్ క్యాలిక్యులేషన్ ఫార్ములాలో మార్పు ఉండవచ్చని అంటున్నారు. దాన్ని బట్టి చూస్తుంటే డియర్‌నెస్ అలవెన్స్ 3 శాతం పెరుగుతుందని అంటున్నారు.
డియర్‌నెస్ అలవెన్స్ అంటే ఏమిటి?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి జీవన వ్యయాన్ని మెరుగుపరచడానికి డియర్‌నెస్ అలవెన్స్ (DA) పొందుతారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డియర్‌నెస్ అలవెన్స్ లెక్కించబడుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) , పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ పేరుతో ఈ డబ్బు ఇవ్వబడుతుంది.
డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ) ఫార్ములా ఏమిటి?
కరువు భత్యానికి సంబంధించి కార్మిక మంత్రిత్వ శాఖ క్యాలిక్యులేషన్ ఫార్ములా మార్చింది. కార్మిక మంత్రిత్వ శాఖ 2016లో డియర్‌నెస్ అలవెన్స్ ఆధార సంవత్సరాన్ని మార్చింది. 2016=100 బేస్ ఇయర్‌తో కొత్త సిరీస్ డబ్ల్యుఆర్‌ఐ పాత 1963-65 బేస్ ఇయర్‌ని భర్తీ చేసిందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read: Rashmika Mandanna top 10 movies: పుష్ప, వారసుడు సహా రష్మిక కెరీర్లో టాప్ టెన్ సినిమాలివే!
కరువు భత్యం ఎలా లెక్కించబడుతుంది?
7వ వేతన సంఘం యొక్క ప్రస్తుత డియర్‌నెస్ అలవెన్స్ రేటును ప్రాథమిక వేతనంతో లెక్కించడంతో డియర్‌నెస్ అలవెన్స్ మొత్తం లెక్కించబడుతుంది. బేసిక్ పే రూ.56,900 DA (56,900 x12)/100 అయితే, ప్రస్తుత శాతం రేటు 12%. డియర్‌నెస్ అలవెన్స్ శాతం = గత 12 నెలల CPI సగటు-115.76. ఇప్పుడు ఏది వచ్చినా అది 115.76తో భాగించబడుతుంది. వచ్చే సంఖ్య 100తో గుణించబడుతుంది.
7వ పే కమిషన్ జీతాల పెంపు కింద జీతం లెక్కింపు కోసం, ఉద్యోగి ప్రాథమిక జీతంపై డీఏను లెక్కించాలి. కేంద్ర ఉద్యోగి కనీస ప్రాథమిక వేతనం రూ. 25,000 అనుకుందాం, అప్పుడు అతని డియర్‌నెస్ అలవెన్స్ (DA లెక్కింపు) రూ. 25,000లో 34% ఉంటుంది. రూ.25,000లో 34% రూ.8500 అవుతుందన్న మాట. డియర్‌నెస్ అలవెన్స్ పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. భారతదేశంలోని ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో డియర్‌నెస్ అలవెన్స్ గురించి ప్రత్యేక సమాచారం ఇవ్వాలి. అంటే డియర్‌నెస్ అలవెన్స్ పేరుతో మీరు పొందే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది, దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook