7th Pay Commission Latest News: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (Psychiatry) పోస్టులకు భారీ వేతనాన్ని ఆఫర్ చేస్తోంది. 7వ వేతన సంఘం తాజా సవరణల ప్రకారం ఇది పర్మినెంట్ జాబ్. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు తుది గడువు ఏప్రిల్ 15న ముగియనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉండగా, పూర్తి వివరాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవాలని సూచించింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఏడవ వేతన సంఘం(7th Pay Commission) సిఫార్సుల ప్రకారం లెవెల్ 11 పే స్కేల్ ప్రకారం జీతభత్యాలు అందుకోనున్నారు. అభ్యర్థులు నెలకు రూ.67,700 నుంచి గరిష్టంగా రూ.2,08,700 వరకు వేతనాన్ని అందుకోనున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్(Dearness Allowance), హౌస్ రెంట్ అలవెన్స్(HRA), ట్రావెల్ అలవెన్స్(TA), మెడికల్ రీయింబర్స్‌మెంట్ లాంటి సదుపాయాలు అందుకుంటారని నోటిఫికేషన్‌లో తెలిపారు.


Also Read: Gold Price Today 05 April 2021: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు


యూపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్ ప్రకారం, ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పర్మినెంట్ జాబ్ హోల్డర్స్‌గా పనిచేయనున్నారు. వీరికి గ్రూప్ ఏ కేంద్ర హెల్త్ సర్వీసెస్ టీచింగ్ స్పెషలిస్ట్ సబ్ క్యాడర్ ఉద్యోగికి నియామకం అవుతారు. అయితే వీరికి ఏడాది పాటు ప్రొబేషనరీ కాల వ్యవధి ఉంటుంది. అనంతరం ఉద్యోగం పర్మినెంట్ కానుంది. వీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా తమ సేవల్ని అందించాల్సి ఉంటుంది. యూపీఎస్సీ(UPSC Exam) నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. 


Also Read: IBPS Clerk Mains Result 2020: ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఫలితాలు 2020 వచ్చేశాయి, డైరెక్ట్ లింక్ మీకోసం


మొత్తం పదకొండు పోస్టులలో అన్ రిజర్వ్‌డ్ విభాగంలో 7 పోస్టులు భర్తీ చేయనుండగా, ఓబీసీ కోటాలో 3 పోస్టులు, షెడ్యూల్డ్ కులాలకు 1 కేటాయించారు. అన్ రిజర్వ్‌డ్ విభాగంలో అభ్యర్థులు 15 ఏప్రిల్ 2021 నాటికి 40 ఏళ్లకు మించరాదు. ఓబీసీలకు గరిష్ట వయసులో మూడేళ్లు సడలింపు ఉంటుంది. అంటే 43 ఏళ్లకు మించరాదు. ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు నాటికి 45 ఏళ్లకు మించరాదని వయోపరిమితిని నిర్ణయించారు. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో మీకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook