7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు తెరపడింది. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. డీఏను 38 శాతం నుంచి 42 శాతానికి పెంచారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతి సంవత్సరం మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని పెంచుతున్న విషయం తెలిసిందే. అందరూ అంచనా వేసినట్లే నాలుగు శాతం డీఏను పెంచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉద్యోగులు, పెన్షనర్‌లకు డియర్‌నెస్ అలవెన్స్ లేబర్ బ్యూరో జారీ చేసిన ఇండస్ట్రియల్ వర్కర్స్ (CPI-IW) కోసం వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా లెక్కింపు ఉంటుంది. పెరిగిన డీఏ జనవరి 1వ తేదీ నుంచి వర్తించనుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంపు నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.12,815.60 కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయంతో 47.58 లక్షల మంది ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.


డీఏ పెంపు ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంచనా వేసినట్లే నాలుగు శాతం డీఏ పెంచడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పెరిగిన జీతం జనవరి నెలతో కలిపి ప్రభుత్వం జమ చేయనుంది. దీంతో ఒకేసారి భారీగా నగదు ఖాతాలో జమకానుంది. 42 శాతం డీఏతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం పెరగనుందంటే..


కనీస ప్రాథమిక వేతనంపై లెక్కింపు ఇలా..


==> ఉద్యోగి బేసిక్ శాలరీ–రూ.18 వేలు
==> కొత్త DA (42 శాతం)–నెలకు రూ.7,560
==> ప్రస్తుత DA (38 శాతం)–నెలకు రూ.6,840
==> ఎంత DA పెరగనుంది-నెలకు రూ.720 (రూ.7,560-రూ.6,840)
==> వార్షిక జీతంలో పెంపు -720X12= రూ.8,640


గరిష్ట జీతం స్థాయిలో ఇలా..


==> ఉద్యోగి బేసిక్ శాలరీ-రూ.56,900
==> కొత్త డియర్‌నెస్ అలవెన్స్ (42 శాతం)-రూ.23,898
==> ప్రస్తుత DA (38 శాతం)-నెలకు రూ.21,622
==> ఎంత DA పెరగనుంది-నెలకు రూ.2276 (రూ.23,898-రూ.21,622)
==> వార్షిక జీతంలో పెంపు -రూ.2276X12=రూ.27312


Also Read: Rahul Gandhi: సంచలన నిర్ణయం.. రాహుల్ గాంధీపై వేటు.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు  


Also Read: YSRCP MLAs Suspended: నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు.. ఆ ఇద్దరు వీళ్లే..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి