Karnataka Govt on 7th Pay Commission: 7వ వేతన సంఘం అమలుపై కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలోగా తమ సిఫార్సులను సమర్పించాలని భావిస్తున్నామని.. దీని అమలుపై రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికలకు ముందు కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు ఏడవ వేతన కమిషన్‌ను డిమాండ్ చేస్తూ సరార్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. ఎన్నికల వాతావరణంలో వారిని శాంతింపజేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి బస్బరాజ్ బొమ్మై రాష్ట్రంలో త్వరలో ఏడో వేతన సంఘం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలోనే నవంబర్‌లో రాష్ట్రంలో ఏడో వేతన సంఘం అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. 
 
అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ఖజానా పరిస్థితిని బట్టి 7వ వేతన సంఘం ఎప్పుడు అమలు చేస్తామని చెప్పారు. ఈసారి నవంబర్‌లో రాష్ట్రంలో ఏడవ వేతన సంఘం అమలులోకి వచ్చే అవకాశం ఉందని హోంమంత్రి జి.పరమేశ్వర్ అన్నారు. 7వ వేతన సంఘం అమలుపై బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక కమిటీ వేసింది. ఏడో వేతన సంఘం అమలు సాధ్యసాధ్యాలను ఈ కమిషన్‌ను పరిశీలించింది. ఈ కమిటీ నివేదిక వచ్చే నెలలో ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. ఈ నివేదిక అందగానే ప్రతిపాదన మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వెల్లడించారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వం నుంచి బిగ్‌ గిఫ్ల్ వస్తుందని రాష్ట్ర ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

“పే కమిషన్ తన సిఫార్సులను నవంబర్‌లో సమర్పించాల్సి ఉంది. వేతన సంఘం నివేదిక అమలుపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏడవ వేతన సంఘం అమలు చేస్తాం.” రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి పరమేశ్వర్ భరోసా ఇచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కొత్త పెన్షన్‌ విధానాన్ని (ఎన్‌పీఎస్‌) రద్దు చేసి.. పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేశామని.. నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం త్వరలో కర్ణాటక ఆరోగ్య సంజీవిని స్కీమ్‌ను ప్రారంభించనుందని తెలిపారు హోమంత్రి. అదేవిధంగా రానున్న ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 2.5 లక్షల ఖాళీ ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తుందని చెప్పారు. 7వ వేతన సంఘం సిఫార్సులను వీలైనంత త్వరగా అమలు చేయాలని.. కరువు భత్యాన్ని 23 శాతం పెంచాలని మంత్రిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎస్‌ షడక్షరి రిక్వెస్ట్ చేశారు.


Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు  


Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook