7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక, డీఏ 4 శాతం పెంచుతూ ప్రకటన
7th Pay Commission: 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా రెండు సార్లు డీఏ పెరుగుతుంటుంది. ఇప్పుడు రెండవ విడత డీఏను 4 శాతం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. దసరా పండుగకు ముందే ఉద్యోగులకు భారీ నజరానా ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం కంటే ముందే సిక్కిం ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ ఇచ్చింది. డీఏ 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దసరాకు ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులకు చాలా రిలీఫ్ కలిగింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సైతం వెలువడ్డాయి.
ప్రస్తుతం దసరా రేపట్నించి మొదలు కానుంది. ఆ తరువాత దీపావళి పండుగ ఉంది. దసరా, దీపావళి పండుగల నేపధ్యంలో ఉద్యోగులకు సిక్కిం ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. డీఏ 4 శాతం పెంచింది. దసరాకు ముందే ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ అందించింది. ప్రస్తుతం సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ 46 శాతంగా ఉంది. ఇప్పుడు ప్రభుతవం 4 శాతం పెంచడంతో మొత్తం డీఏ 50 శాతానికి చేరుకుంది. డీఏ పెంపు అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి కూడా వర్తించనుంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు కోసం చాలా రోజుల్నించి నిరీక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 3 శాతం పెరగవచ్చని తెలుస్తోంది. అక్టోబర్ 9వ తేదీన జరగనున్న కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి ముందే డీఏ బహుమతి ఇవ్వనుందని తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 50 శాతం అందుతోంది. ఇప్పుడు 3 శాతం పెరిగితే మొత్తం డీఏ 53 శాతం కానుంది.
అయితే కరోనా సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ బకాయిలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
Also read: 7th Pay Commission DA Hike: ఉద్యోగులకు దసరా కానుక, అక్టోబర్ 9న డీఏ పెంపు ప్రకటన, ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.