Uttarakhand: పాఠశాలలో కరోనా కలకలం..85 మంది విద్యార్థులకు పాజిటివ్!
Uttarakhand: ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లాలోని ఓ పాఠశాలలో 85 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని ఓ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. నైనితాల్ జిల్లాలోని గంగర్‌కోట్ జవహార్ నవోదయ విద్యాలయలో (gangarkote Jawahar Navodaya Vidyalaya) 85 మంది విద్యార్థులకు కరోనా (Covid-19) సోకినట్లు శనివారం నిర్ధరణ అయింది. "పాఠశాల సిబ్బంది సహా 11 మంది విద్యార్థులు కరోనా బారినపడినట్లు తొలుత తేలింది. దాంతో పాఠశాలలోని 496 మంది విద్యార్థులకు కరోనా టెస్టులు చేశాం. అందులో 85 మంది విద్యార్థులకు కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది" అని నైనితాల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ రాహుల్ సాహ్ తెలిపారు.
డిప్యూటీ కలెక్టర్ రాహుల్ సాహ్ (Naintal Deputy collector Rahul Sah) ఆదేశాల మేరకు..పాఠశాలను మైక్రో కంటెయిన్మెంట్ జోన్‌గా ఏర్పాటు చేశామని ఓ అధికారి తెలిపారు. అదే విధంగా విద్యార్థులు ఐసొలేషన్‌లో ఉండేలా పాఠశాలలోనే ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీపీసీఆర్లో కరోనా నెగెటివ్‌గా తేలిన విద్యార్థులకు మరోసారి యాంటీజెన్ పరీక్షలు నిర్వహించి డిశ్ఛార్జి చేస్తున్నామని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో శనివారం నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ (Omicron Cases in Uttarakhand) బాధితుల సంఖ్య 8కి చేరింది.
Also Read: COVID19 Guidelines: కొవిడ్ రూల్స్ పాటించని వారిపై చర్యలు- ఒక్క రోజే రూ.కోటి ఫైన్లు!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 27,553 కేసులు (India Covid cases) వెలుగుచూశాయి. మరో 284 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,249 మంది కోలుకున్నారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,525కి చేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook