8th Pay Commission News Central Govt Employees Salary Details: 8వ వేతన సంఘం ఏర్పాటు చేసే అంశంపై రెండు ప్రతిపాదనలు వచ్చినట్లు తాజాగా కేంద్ర సర్కార్ వెల్లడించింది. అయితే ఆ సంఘం ఏర్పాటుపై తామేమీ ఆలోచించలేదని,‌ మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర సర్కార్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా 2026 జనవరి ఒకటో తేదీ నుంచి.. ఎనిమిదవ వేతన సంఘం సిఫారసులను అమలు చేయాల్సి ఉంటుంది.  కానీ ఆ పే-కమిషన్ ఏర్పాటు చేయాలని.. ఈ ఏడాది జూన్ లో  రెండు ప్రతిపాదనలు వచ్చాయని..వాటి గురించి తమ ఇంకా ఏమీ ఆలోచించలేదని కేంద్ర సహాయ ఆర్థిక శాఖ మంత్రి చౌదరి స్పష్టం చేశారు. అంతేకాదు రాజ్యసభలో లిఖితపూర్వకంగా.. ఆయన సమాధానం ఇచ్చారు. 


ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను రివైజ్ చేసేందుకు.. ప్రతి పదేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం పే-కమిషన్ ను  నియమిస్తుంది. ఏడవ వేతన సంఘాన్ని.. 2014 ఫిబ్రవరిలో ఏర్పాటు చేయగా, ఆ పే కమిషన్ ప్రతిపాదనలను 2016 జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తున్నారు.


ఇక ఇప్పుడు తదుపరి పే-కమీషన్ 2026 జనవరి ఒకటవ తేదీ నుంచి..అమలు చేయాల్సి ఉంటుంది.  కానీ అంతలోపే ఇలా ప్రతిపాదనలు రావడంతో ఇప్పట్లో ఏమీ ఆలోచించలేదని, ఇంకా రెండు సంవత్సరాలకు పైగా సమయం ఉంది కదా అప్పుడు ఆలోచించే ప్రయత్నం చేస్తామంటూ కేంద్ర సర్కారు చెప్పినట్లు సమాచారం. 


ఒకవేళ ఎనిమిదో వేతన సంఘం చర్చల తర్వాత జీతాలు మరియు పెన్షన్ సవరణ జరిగితే, గణనీయంగా జీతాలు, పెన్షన్ పెరుగుతుంది. లెవెల్ 1 ఉద్యోగస్తులకు సుమారు రూ. 34,560 పెరిగే అవకాశం ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే లెవెల్ 18 రూ.4.8 లక్షలకు చేరుకోవచ్చని సమాచారం. ఇక ఈ సవరణలు  యూనిఫైడ్ పెన్షన్ స్కీం కింద పెన్షన్ లను కూడా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కొత్తగా పెంచే జీతాలు పే స్కేల్ ఆధారంగా లెక్కించబడతాయి. అయితే దీనిపై అధికారికంగా ఏమి ప్రకటించలేదు కాబట్టి ఒకవేళ పెంచితే ఈ రేంజ్ లో మార్పు కనిపిస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటితోపాటు డి ఎ కూడా పెరిగే అవకాశం ఉంది.


Read more: GYM Workouts on Saree: చీరకట్టులో మహిళల వర్కౌట్స్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.