8th Pay Commission News: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రతి యేటా ఇంక్రిమెంట్లు, డీఏ, టీఏ పెంపు, హెచ్ఆర్ఏ వంటి ప్రయోజనాలన్నీ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా అమలవుతుంటాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం కాల పరిమితి ముగిసింది. ఇప్పుడు కొత్తగా 8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగులకు మరిన్ని లాభాలు కలగనున్నాయి. అందుకే ఉద్యోగులంతా 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేతన సంఘం ప్రతి పదేళ్లకోసారి ఏర్పడుతుంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరి 28వ తేదీన అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా మరుసటి ఏడాది అంటే 2015 నవంబర్ 19న నివేదిక సమర్పించింది. ఇక 2016 జనవరి 1 నుంచి 7వ వేతన సంఘం అమల్లోకి వచ్చింది. అంటే వేతన సంఘం ఏర్పాటైన రెండేళ్లకు అమలుకు నోచుకుంది. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొద్దికాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుకై డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటైతే కనీసం రెండేళ్ల తరువాత అమల్లోకి రావచ్చంటున్నారు. మరి ఉద్యోగుల కోరికను తీర్చాలంటే త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ప్రకటన ఉండాలి. జూన్ 23న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఈ మేరకు ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. 


ఇప్పటికే 8 వ వేతన సంఘం ఏర్పాటు కోరుతూ కాన్ఫడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ సెక్రటరీ జనరల్ యాదవ్ కేంద్ర ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శికి లేఖ రాశారు. 8వ వేతన సంఘం ఏర్పాటు, ఓపీఎస్ పునరుద్ధరణ, కోవిడ్ సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ద్రవ్యోల్బణం వంటి అంశాల్ని పరిగణలో తీసుకుని ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయించేందుకు, అవసరమైతే పెంచేందుకు వీలుగా వేతన సంఘం ఏర్పాటవుతుంటుంది. ఇప్పుడున్న 7వ వేతన సంఘం కాల పరిమితి పూర్తయిపోయింది. అందుకే కొత్తగా 8వ వేతన సంఘం ఏర్పాటుకై డిమాండ్ విన్పిస్తోంది. 


జూన్ 23న 2024 పూర్తి స్థాయి బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్‌లో 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన ఉండవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేయడం, ఉద్యోగులు, పెన్షనర్లకు కోవిడ్ సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ బకాయిలు , కారుణ్య నియామకాలపై 5 శాతం పరిమితి తొలగించాలనే డిమాండ్లు పరిష్కరించే దిశగా నిర్ణయం ఉండవచ్చని అంచనా. 


Also read: Best Post Office Scheme: పోస్టాఫీసులోని ఈ పధకంలో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook