8th Pay Commission: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 7వ వేతన సంఘం ఫాలో అవుతోంది. ఇది 2013లో ఏర్పడింది. నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడాల్సి ఉంది. 2023తో ఇది పూర్తి కావడంతో ఈ ఏడాది ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు చేస్తుందని ఉద్యోగాలు ఆశిస్తున్నారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగు జీత భత్యాలు కూడా పెరుగుతాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఉన్న 7వ వేతన సంఘం 2013లో ఏర్పడినా అమల్లోకి వచ్చింది మాత్రం 2016లో. ఓ వేతన సంఘం ఏర్పడి విధి విధానాలు రూపుదిద్దుకుని అమల్లోకి వచ్చేందుకు కనీసం 2-3 ఏళ్లు పడుతుంటుంది. 7వ వేతన సంఘం ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతం పెరగడంతో జీతం 14.29 శాతం పెరిగి కనీస వేతనం 18 వేలుగా మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 8వ వేతన సంఘం గురించి చర్చ ఉండవచ్చు. బహుశా అందుకే కార్మిక శాఖ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలలో ఏఐసీపీఐ ఇంటెక్స్ జారీ చేయలేదు. డీఏ 50 శాతం చేరినప్పుడు జీరో నుంచి ప్రారంభమౌతుందనే విషయంలో కాస్త సందిగ్దత కూడా నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత 8వ వేతన సంఘంపై నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు లేఖ రాశాయి. ఒకవేళ కొత్త ప్రభుత్వం ఈ డిమాండ్ అంగీకరిస్తే 1 కోటి 12 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ది పొందనున్నారు. 


ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 50 శాతంగా ఉంది. ఇప్పుడు జూలై నెలలో మరో 4 శాతం పెరగవచ్చు. జనవరి నుంచి జూన్ వరకూ ఉన్న ఛార్ట్ ఆధారంగా ఈ నిర్ణయం ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత కొత్త ప్రభుత్వం ముందుకు 8వ వేతన సంఘం చర్చ రానుంది. ఒకవేళ 8వ వేతన సంఘం అమలైతే ఉద్యోగుల జీతభత్యాలు ఎంత వరకూ పెరగనున్నాయో చూద్దా.ం


ప్రతి పదేళ్లకు కొత్త వేతన సంఘం ఏర్పడాలి. 2013లో 7వ వేతన సంఘం ఏర్పడి 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగానే ఫిట్‌మెంట్ ఫ్యాక్ట్రర్ 2.57 సార్లు పెరగడంతో 14.29 శాతం పెంపుదలతో కనీస వేతనం 18000 అయింది. 8వ వేతన సంఘం అమలైతే 2025-26లో జీతం 44.44 శాతం పెరిగి కనీస వేతనం 26000 అవుతుంది. ఎందుకంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.68 శాతం పెరుగుతుంది. 2026 నుంచి అమలు కావచ్చు.  అంటే జీతం 49,420 రూపాయలు కావచ్చు. 


Also read: Toll Fee Hike: ఇవాళ అర్ధరాత్రి నుంచి టోల్ ధరల బాదుడు, 5 శాతం పెరిగిన ఫీ



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook