మహారాష్ట్ర ప్రభుత్వం మద్యం విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాలకు వెళ్లాల్సిన పనిలేకుండా.. లిక్కర్‌ను నేరుగా ఇళ్లకే డెలివరీ (హోమ్ డెలివరీ) చేసే విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు మహారాష్ట్ర ప్రభుతం తెలిపింది. 'ఇటీవలే రాష్ట్రంలో పెరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ మరణాలను తగ్గించడానికి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నాం' అని ఆ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి చంద్రశేఖర్ భవన్ కులే తెలిపారు. కాగా దేశంలో ఈ విధమైన విధానం అమల్లోకి తెచ్చే మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలవనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కనీస వయస్సు, ఆధార్ వివరాలు తీసుకొని నిర్ధారించుకున్న తర్వాతే అమ్మకందారుడు వినియోగదారులకు మద్యాన్ని డెలివరీ చేయనున్నాడు.


'మద్యం కొనుగోలుకు ఆధార్ కార్డ్ తప్పనిసరి. కొనుగోలుదారుడు తప్పనిసరిగా ఆధార్ కార్డును చూపించవలసి ఉంటుంది. మద్యం సీసాకు జియో ట్యాగ్ ఉంటుంది. ప్రభుత్వం ఆ ట్యాగ్ ద్వారా అమ్మకందారు, కొనుగోలుదారులను ట్రాక్ చేయగలదు. ఈ చర్య నకిలీ మద్యం మరియు స్మగ్లింగ్‌ను నివారించవచడానికి సహాయపడుతుంది.' అని ఓ అధికారి తెలిపారు.


2015లో కనీసం 84 మంది ముంబయిలో అక్రమ మద్యం సేవించి మరణించారు. నకిలీ మద్యం ఉత్పత్తిని తనిఖీ చేయలేకపోయినందుకు, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఎనిమిది మంది పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేసుతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులు పోలీస్ కస్టడీలో ఉన్నారు.