రైలు ప్రమాదం: 16కి చేరిన మృతులు సంఖ్య
వలస కార్మికులు సొంత ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారు. కానీ అంతలోనే పెను విషాదం చోటుచేసుకుంది. రైలు ప్రమాదం ఘటనలో మరో ఇద్దరు వలస కూలీలు చనిపోయారు.
మహారాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం ఘటనలో మరో ఇద్దరు వలస కూలీలు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 16కి చేరుకుందని పోలీసులు తెలిపారు. రైలు ప్రమాదం ఘటనపై ఔరంగాబాద్ ఎస్పీ మోక్షద పాటిల్ స్పందించారు. శుక్రవారం వేకువజామున 5:15 ప్రాంతంలో ఓ గూడ్స్ రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికుల మీద నుంచి వెళ్లిందన్నారు. విషాదం: వలస కూలీలను చిదిమేసిన రైలు
ఘటనా స్థలాన్ని పరిశీలించాం, దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కార్మికులు సొంత ప్రాంతాలకు తిరుగు ప్రయాణమయ్యారు. కానీ అంతలోనే పెను విషాదం చోటుచేసుకుంది. కూతురికి కరోనా పేరు పెట్టుకున్న మహిళా ఎంపీ
రైల్వేశాఖ ఈ దారుణ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పట్టాలపై కొందరు నిద్రిస్తున్నట్లుగా గమనించిన లోకో పైలట్ అప్రమత్తమైనా ప్రయోజనం లేకపోయిందన్నారు. రైలును ఆపేదందుకు ఎంతగా యత్నించినా పట్టాలపై నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి దూసుకెళ్లిందని రైల్వే శాఖ స్పందించింది. గాయపడ్డ వారిని ఔరంగాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!