Aadhar cards mandatory for subsidy of Rs 25 per litre petrol for 2 wheelers in Jharkhand : అక్కడ లీటరు పెట్రోల్ 25 రూపాయలు తక్కువగా లభించబోతోంది. ఆధార్‌‌ కార్డు ఉంటే చాలు టూవీలర్స్‌కు తక్కువ ధరకు పెట్రోల్ కొట్టించుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి నెలకు గరిష్టంగా పది లీటర్ల పెట్రోల్ మాత్రమే ఇలా 25 రూపాయల సబ్సిడీపై పొందే అవకాశం ఉంటుంది. జార్ఖండ్‌లో (Jharkhand) త్వరలోఈ విధానం అమలులోకి రానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జార్ఖండ్‌లో లీటర్ పెట్రోల్‌పై 25 రూపాయల సబ్సీడీకి (subsidy of Rs 25 per litre petrol) ఆధార్ కార్డు (Aadhar card) తప్పనిసరి అని జార్ఖండ్ మంత్రి హఫీజుల్ హసన్ (Jharkhand Minister Hafizul Hassan) తెలిపారు. పెట్రోల్‌పై 25 రూపాయల సబ్సీడీ విధానం ఏప్రిల్ 1 వరకు అమలు చేస్తామని మంత్రి (Minister) వివరించారు. లైసెన్స్ లేని వారికి కూడా ఈ సబ్సీడీ (subsidy) విధానం ద్వారా పెట్రోలు అందజేస్తామన్నారు. 


ఇక ఈ విధానం వల్ల నెలకు ఒక వ్యక్తి రూ.250 (Rs.250) ఆదా చేయొచ్చు. ఆ మొత్తం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేరుగా వినియోగదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. 


ఇక లీటర్‌‌ పెట్రోల్‌పై 25 రూపాయల సబ్సీడీ విధానం (subsidy of Rs 25) అమలుతో, దేశంలో పెట్రోల్ ధరల్లో భారీ తగ్గింపు ప్రకటించిన తొలి ముఖ్యమంత్రిగా నిలిచారు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. (Jharkhand CM Hemant Soren) ఇక జనవరి 26 నుంచి ఈ పెట్రోల్ ధర తగ్గింపు ప్రయోజనాన్ని ప్రజలు పొందవచ్చు.


Also Read : Flights Collision: గాల్లో ఎదురెదురుగా వచ్చిన 2 ఇండిగో విమానాలు.. ఆ తర్వాత ఏమైంది?


ఇక కేంద్రం గతేడాది నవంబర్‌లో ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి పెట్రోల్‌పై (petrol) 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించిన తర్వాత ఇరవైకి పైగా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించాయి. దీంతో పెట్రోలు ధరల (Petrol prices) నుంచి కొన్ని రాష్ట్రాల్లో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. 


Also Read : Instagram Nationality Challenge: ఇన్​స్టాలో నేషనాలిటీ ఛాలెంజ్​ వీడియో ఎలా చేయాలి?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook