Flights Collision: గాల్లో ఎదురెదురుగా వచ్చిన రెండు ఇండిగో విమానాలు.. ఆ తర్వాత ఏమైంది?

Flights Collision: బెంగళూరులో భారీ విమాన ప్రమాదం తప్పింది. ఇండిగోకు చెందిన రెండు విమానాలు గాల్లో ఎదురెదురుగా వచ్చాయి. ఆ తర్వాత ఏమైందంటే..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 09:53 PM IST
  • ఇండిగో విమానాలకు తప్పిన పెను ప్రమాదం
  • గాల్లో ఎదురెదురుగా వచ్చిన 2 విమానాలు
  • 426 మందికి తప్పిన ప్రాణాపాయం
Flights Collision: గాల్లో ఎదురెదురుగా వచ్చిన రెండు ఇండిగో విమానాలు.. ఆ తర్వాత ఏమైంది?

Flights Collision: బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం గగనతంలో ఇటీవల భారీ ప్రమాదం తప్పింది. ఇండియా సంస్థకు చెందిన రెండు విమానాలు దాదాపు ఢీకొన్నంత పనైంది. రాడార్ కంట్రోలర్​ అప్రమత్తత కారణంగా ఈ ప్రమాదం (IndiGo mid air collision) తృటిలో తప్పింది.

అయితే ఇంతటి భయంకరమైన ఘటన గురించి లాగ్​బుక్​లో నమోదు చేయడం గానీ లేదా.. అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా విమానయాన నియంత్రణ సంస్థకు గానీ నివేదించకపోవడం మరింత ఆందోళన కలిగించే (IndiGo Flight accident) విషయం.

నిజానికి ఈ ఘటన ఈ నెల 9న చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని డైరెక్టర్ జనరవల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్​ డీజీసీఏ సీరియస్​గా తీసుకుంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ (DGCA on mid air collision) ఇచ్చింది.

అసలు ఏమైందంటే..

ఇండిగోకు చెందిన 6ఈ 455 విమానం బెంగళూరు నుంచి కోల్​కతా వెళ్లేందుకు గాళ్లోకి ఎగిరింది. ఇందుకు సౌత్ టవర్ కంట్రోలర్​ అనుమతినిచ్చారు.

ఇదే సమయంలో 6ఈ 246 విమానం బెంగళూరు నుంచి భువనేశ్వర్​ వెళ్లేందుకు సిద్ధమైంది దీనికి నార్త్​ టవర్ కంట్రోలర్ అనుమతినిచ్చారు.

రెండు విమానాలు కేవలం ఐదు నిమిషాల గ్యాప్​లో గాళ్లోకి ఎగిరాయి. దీనితో గగన తలంలో రెండు విమానాలు ఎదురెదురుగా అత్యంత సమీపానికి (Collision Averted) వచ్చాయి. ఇది గమనించిన రాడార్​ కంట్రోలర్ పైలట్లను అప్రమత్తం చేసింది. దీనితో పెను ప్రమాదం తప్పింది.

ఇంతకీ ఎక్కడ మిస్టేక్ జరిగిందంటే..

కెంపగౌడ విమానాశ్రయంలో రెండు రన్​వేలు ఉన్నాయి. ఒకటి ఉత్తరం వైపు ఉంటుంది. దీనిని టేకాఫ్​ కోసం ఉపయోగిస్తారు. రెండోది దక్షిణం వైపు ఉన్నాయి. దీనిని ల్యాండింగ్​ కోసం వినియోగిస్తుంటారు.. అయితే ఈ ఘటన జరిగిన రోజు సౌత్​ రన్​వేను మూసేసి.. నార్త్​ రన్​వేను టేకాఫ్, ల్యాండింగ్​ కోసం వినియోగించాలని సంబంధిత ఇన్​ఛార్జ్ నిర్ణయించారు. అయితే ఈ విషయాన్ని సౌత్​ కంట్రోలర్​కు అందించలేదు. దీనితో ఈ ప్రమాదానికి అవకాశమిచ్చినట్లైంది.

ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో బెంగళూరు నుంచి కోల్​కతా వెళ్తున్న విమానంలో 176 మంది ప్రయాణుకులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఇక భువనేశ్వర్ వెళ్లాల్సిన విమానంలో 238 ప్యాసింజర్లు, 6గురు సిబ్బంది (IndiGo flights Bengaluru) ఉన్నారు.

Also read: Prisoner Swallows Phone: మొబైల్ మింగేసిన ఖైదీ.. ఆపరేషన్ లేకుండానే బయటకు తీసిన వైద్యులు

Also read: Goa assembly Elections: గోవా ఆప్​ 'సీఎం' అభ్యర్థిగా అమిత్​ పాలేకర్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News