AAP MLA Adarsh Shastri joins Congress: కాంగ్రెస్‌లో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు
ఢిల్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సొంత పార్టీల్లో టికెట్స్ లభించని నేతలు.. మరో పార్టీ తరపున టికెట్ కోసమో.. లేక సొంత పార్టీ అభ్యర్థిని ఓడించడం కోసమో మరో పార్టీలోకి జంప్ అవుతున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా శనివారం నాడు కూడా అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సొంత పార్టీల్లో టికెట్స్ లభించని నేతలు.. మరో పార్టీ తరపున టికెట్ కోసమో.. లేక సొంత పార్టీ అభ్యర్థిని ఓడించడం కోసమో మరో పార్టీలోకి జంప్ అవుతున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా శనివారం నాడు కూడా అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఢిల్లీలోని ద్వారక నియోజకవర్గం నుంచి ఢిల్లీ అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆదర్శ్ శాస్త్రి కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదర్శ్ శాస్త్రి ఎవరో కాదు.. లాల్ బహదూర్ శాస్త్రికి స్వయాన మనవడు. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 59.08 శాతం ఓట్లతో గెలుపొందిన ఆదర్శ్ శాస్త్రిని ఆప్ ఈసారి పక్కనపెట్టేసింది. కాంగ్రెస్ పార్టీని వీడి జనవరి 14న తమ పార్టీలో చేరిన వినయ్ కుమార్ మిశ్రాకు ఆప్ టికెట్ కేటాయించడాన్ని జీర్ణించుకోలేని ఆదర్శ్ శాస్త్రి.. ఇవాళ ఆప్‌కి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీ పీసీసీ చీఫ్ సుభాష్ చోప్రా, సీనియర్ కాంగ్రెస్ నేత పీసీ చాకో సమక్షంలో ఆదర్శ్ శాస్త్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read also : 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ.
ఆదర్శ్ శర్మ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది ముందుగా ఊహించిందే. ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిథి ముకేశ్ శర్మ సైతం ఓ ప్రకటన చేశారు. ఆదర్శ శర్మ తమ పార్టీలో చేరతారంటూ ముకేశ్ శర్మ ముందుగానే వెల్లడించారు. మంగళవారం ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న 70 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. అందులో 46 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు కల్పించింది. 15 సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో మరొకరికి పార్టీ టికెట్ కేటాయించింది. ఇక చివరిసారి ఓడిపోయిన 9 స్థానాల నుంచి ఈసారి పార్టీ కొత్త వారికి అవకాశం కల్పించింది.
ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫిబ్రవరి 14న ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీ సర్కార్‌కి పదవీకాలం ముగియనుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..