70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల కన్నా తక్కువ సమయం ఉన్నందున, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేడు దేశ రాజధానిలోని మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో

Last Updated : Jan 14, 2020, 08:02 PM IST
70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ.

న్యూ ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల కన్నా తక్కువ సమయం ఉన్నందున, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేడు దేశ రాజధానిలోని మొత్తం 70 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో 46 మంది సిట్టింగ్ శాసనసభ్యులకు అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో మహిళలకు 6 స్థానాలు కేటాయించగా ఈ ఎన్నికల్లో 8స్థానాలు కేటాయించారు.  

ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ విడుదల చేసిన లేఖలో పట్పర్‌గంజ్ అభ్యర్థిగా మనీష్ సిసోడియా, షకుర్ బస్తీ నుండి సత్యేంద్ర జైన్, త్రి నగర్ నుండి జితేంద్ర తోమర్, తిలక్ నగర్ నుండి జర్నైల్ సింగ్, కల్కాజీ నుండి అతిషి, కృష్ణ నగర్ నుండి  ఎస్ కే  బగ్గా ఉన్నారు. 

70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఢిల్లీలో ఫిబ్రవరి 8న ఓటింగ్ జరగనుండగా, 11న ఫలితాలు వెలుడనున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News