న్యూ ఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ ( Aatmanirbhar Bharat importance) సాధించడంలో లక్షలాది సవాళ్లు ఎదురవుతాయని తనకు తెలుసునని, ఆత్మ నిర్భర్ కార్యసాధనలో ఆ సవాళ్లు మరింత అధికమవుతాయనేది కూడా తెలుసని... కానీ ఆ సవాళ్లన్నింటికీ కోట్లకొద్ది సమాధానం చెప్పే శక్తి భారత్‌కి ఉందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తంచేశారు. వోకల్ ఫర్ లోకల్ ( Vocal for local ) నినాదాన్ని ప్రోత్సహిస్తూ స్థానికంగా తయారైన వస్తు, సామాగ్రి, ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవం ( 74th Independence Day celebrations ) సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుండి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోదీ జాతిని ఉత్తేజపరిచే వ్యాఖ్యలు చేశారు. ఆత్మనిర్భర్ భారత్ ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టిసారిస్తూ ప్రధాని మోదీ ప్రసంగం కొనసాగింది. Also read : 74th Independence Day: ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరణ పూర్తి షెడ్యూల్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభంలో డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్స్, అంబులెన్స్ డ్రైవర్లు, కార్పొరేషన్ సిబ్బంది, ఇలా ఎంతో మంది దేశాన్ని ఆదుకున్నారని.. వాళ్లందరికీ ఈ వేదికపై నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. దేశం ఆర్థికంగా ముందుకు వెళ్లాలంటే '' మేకిన్ ఇండియా ( Make in India ) నినాదంతో పాటు మేక్ ఫర్ వరల్డ్ ( Make for world ) అనే నినాదాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది'' అని ప్రధాని మోదీ సూచించారు. కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus pandemic) వ్యాపించడం మొదలైన కొత్తలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని.. అప్పుడు కరోనాను ఎదుర్కునేందుకు దేశంలో ఉన్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతూ రావడమే కాకుండా ఇవాళ మనం ప్రపంచానికే ఆపన్నహస్తం అందించే స్థాయికి చేరుకున్నామని అన్నారు. కొవిడ్-19 ( COVID-19) వచ్చిన కొత్తలో అవసరమైన స్థాయిలో వెంటిలేటర్స్ ( Ventilators ) లేవని.. కానీ ప్రస్తుతం ఆ సమస్య లేదని, దేశవ్యాప్తంగా వెంటిలేటర్స్ తయారవుతున్నాయని అందుకు ఓ ఉదాహరణగా చెప్పుకొచ్చారు. Also read : SP Balu: నాకేం కాదు.. ఐసీయూలో ఎస్పీ బాలు థంబ్స్ అప్ ఫోటో వైరల్


కరోనావైరస్ కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుండి దేశంలోని అన్నిరంగాల వారిని ఆదుకునేందుకు Aatmanirbhar Bharat ఎంతో ఉపయోగపడుతోందని.. ఇప్పటికే ఆత్మనిర్భర్ భారత్ ఫలాలు అందడం ప్రారంభమైందని ప్రధాని మోదీ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు 130 కోట్ల మంది భారతీయుల సక్సెస్ మంత్రగా ( Success mantra ) మారిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రధాని జన్ ధన్ ఖాతాల ( Jan dhan bank accounts ) ద్వారా దేశంలో ఎంతోమంది నిరుపేదల ఖాతాల్లో సమయానికి నగదు జమచేసి వారిని ఆదుకున్నామని... రైతులు ఒక్కప్పటిలా దళారి వ్యవస్థలో నలిగిపోకుండా తమ పంటలను తమకు నచ్చిన విధంగా సరైన మద్దతు ధరకు ( MSP for farmers ) విక్రయించే స్థాయికి చేరుకున్నామని అన్నారు. ఆత్మనిర్భర్‌తో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయని ప్రధాని మోదీ పలు అంశాలను ఉదాహరణగా ప్రస్తావించారు. Also read : Lav Agarwal: కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీకి కరోనా