Vijay has no affiliation with any political party: చెన్నై: కోలీవుడ్ (తమిళం) సూపర్ స్టార్ తలపతి విజయ్‌ ( Actor Vijay ) రాజకీయాల్లోకి అరంగేట్రం చేయబోతున్నట్లు గురువారం వార్తలు షికార్లు చేశాయి. సామాజిక సేవ కోసం విజయ్‌ నడిపిస్తున్న ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ ( Vijay Makkal Iyakkam ) సంస్థలో కొన్ని మార్పులు చేసి, ‘ఆలిండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కమ్‌' పార్టీగా రిజిస్ట్రేషన్‌ కోసం ఎన్నికల సంఘంలో పేరును నమోదు చేశారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఈ వార్తలన్నీంటికి చెక్ పెడుతూ.. విజయ్ గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ పార్టీతో ప్రత్యేక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం లేదని అది తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ (SA Chandrasekar) ఏర్పాటుచేశారని విజయ్ తెలిపారు. తన తండ్రి పార్టీని ప్రారంభించినట్లు మీడియా ద్వారా తెలిసిందని ఆయన పేర్కొన్నారు. https://zeenews.india.com/telugu/tags/tamil-nadu


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే భవిష్యత్తులో తన తండ్రి తీసుకునే రాజకీయ నిర్ణయాలు తనను ఏ విధంగానూ ప్రభావితం చేయవని విజయ్ తేల్చిచెప్పారు. దీంతోపాటు విజయ్.. అభిమానులకు కూడా ఓ విజ్ఞప్తిని చేశారు. తన తండ్రి ప్రారంభించిన రాజకీయ పార్టీలో చేరడం లేదా పనిచేయడం కూడా అవసరం లేదంటూ సూచించారు. అయితే ఆ పార్టీకి తన సామాజిక సేవ కార్యక్రమాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. వారి కార్యకాలాపాల్లో తన పేరు, లేదా ఫొటో.. దీంతోపాటు 'విజయ్ మక్కల్ లైక్కం' పేరుతో ఏదైనా కార్యక్రమాలు చేపట్టినా.. వారిపై చర్యలకు వెనకాడనంటూ విజయ్ హెచ్చరించారు. ఇదిలాఉంటే.. విజయ్ రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేస్తున్నాడన్న వార్తలతో.. తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో వాడీవేడీ చర్చ మొదలైంది. Also read : Noel Sean reentry: బిగ్ బాస్‌లోకి నోయల్ రీ ఎంట్రీ ఇస్తున్నాడా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe