న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుతో సరిహద్దు అంశాలు కీలకంగా మారాయి. పొరుగుదేశాల శరణార్థులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించకుండా చూడటం, సరిహద్దులను పటిష్టం చేసుకోవడంలో భాగంగా కేంద‍్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దు వెంబడి ఉన్న సరిహద్దు కంచెను ఆధునికీకరించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా అక్రమ వలసలను కొంత మేర అరికట్టే అవకాశం కలుగుతుంది. కట్‌ చేయడానికి వీలుకాని ఫెన్సింగ్‌కు ఏర్పాట్లు సాగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: జేఎన్‌యూలో పరిస్థితి అదుపులోకి వచ్చింది: వీసీ


బంగ్లాదేశ్‌తో సరిహద్దు వెంబడి లాఠిటిలా సిల్చార్‌ సెక్టార్‌లో సరిహద్దు కంచె కొత్తది ఏర్పాటు చేయడమనేది పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఉంది. 7.18 కిలోమీటర్ల మేర ఉన్న కంచె ఆధునికీకరించడంలో భాగంగా ఈ ప్రాజెక్టు వ్యయం రూ.14.30 కోట్లు కానుంది అంచనా వేశారు. కి.మీకు రూ.2 కోట్ల వ్యయం అవుతుందని తెలుస్తోంది. కాగా, నిత్యం వివాదాలు పొంచి ఉండే పాకిస్థాన్‌ సరిహద్దులో చాలా ప్రాంతాల్లో సరిహద్దు కంచెను తొలగించాల్సి ఉందట. కంచె పాతది కావడంతో పాటు ఐఎస్‌ఐ నుంచి ముప్పు పొంచి ఉండటమే అందుకు ప్రధాన కారణం. 


పాక్‌ ఆర్మీ, ఐఎస్‌ఐలు కలిసి దాదాపు 300 మంది ఉగ్రవాదులను భారత్‌ మీదకు ఉసిగొల్పే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అఫ్గానిస్తాన్‌కు చెందిన తాలిబన్లను సైతం భారత్‌ మీదకు ప్రయోగించే అవకాశాలు లేకపోలేదు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మిలిటెంట్లు భారత్‌పై దాడులు చేసే అవకాశం ఉందని, పాక్‌ నియంత్రణ రేఖ వద్ద, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి లాంచింగ్‌ ప్యాడ్స్‌ ఏర్పాటు చేసుకున్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..