న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల పోరులో ఆమ్ ఆద్మీ పార్టీ (#APP) మరోసారి ప్రభంజనం సష్టించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ 62 సీట్లలో అధికార ఆప్ సొంతం చేసుకోగా, ప్రతిపక్ష బీజేపీకి మరోసారి దారుణ పరాభవం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 8 సీట్లకు పరిమితమై తీవ్రంగా దెబ్బతింది. వరుసగా రెండో అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరకవలేకపోయింది. అయితే ఆప్ విజయంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన అభివద్ది ఓ ఎత్తయితే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరో ఎత్తు అని చెప్పవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల ఫలితాల కథనాల కోసం క్లిక్ చేయండి  


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ కిషోర్ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ తమ పనిని పూర్తి స్థాయిలో చక్కబెట్టింది. ఢిల్లీలో ఆప్ విజయం కేజ్రీవాల్‌తో పాటు వ్యక్తిగతంగా ప్రశాంత్ కిషోర్‌కు కలిసొచ్చింది. ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ గత ఏపీ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైఎస్సార్ సీపీకి అఖండ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. బిహార్‌కు చెందిన పీకే జేడీయూలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అయితే జాతీయ పౌరసత్వ చట్టం (#CAA), ఎన్‌ఆర్‌సీ లాంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వ తీరును బాహాటంగానే వ్యతిరేకించారు.


Also Read: బీజేపీ 6 సీట్లు.. ఆప్ 1.. ఇలా కలిసొచ్చిందా?


ఈ కారణంగా జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఢిల్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో జేడీయూ మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆప్, అరవింద్ కేజ్రీవాల్‌కు విజయం కట్టబెట్టడం పీకేకు నైతిక బలాన్నిస్తోంది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహకర్త పీకే ప్రభావం అధికంగా ఉండేలా కనిపిస్తోంది. ఘర్షణలు, విద్వేషాలు అనేవి లేకుండా చూసుకోవాలన్న పీకే ఒకే ఒక్క ఆలోచన కేజ్రీవాల్‌కు ఈ స్థాయిలో విజయాన్ని ఇచ్చిందని తెలుస్తోంది.


Also Read: నెటిజన్ ‘పెంట’ కామెంట్‌పై అనసూయ ఏమన్నారంటే!


తర్వాతి రాష్ట్రాలివే..
బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి మహామహులు రంగంలోకి ప్రచారం చేసినా ఢిల్లీలో ‘సామాన్యుడు’ కేజ్రీవాల్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఢిల్లీ ఎన్నికలిచ్చిన ఉత్సాహంతో పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పనిచేసేందుకు పీకేకు అవకాశం లభించింది. వచ్చే ఏడాది జరగనున్న ప.బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీకి పీకే వ్యూహకర్తగా చేయనున్నారు. ఢిల్లీ ఎన్నికలతోనే బెంగాల్ ప్రచారానికి కసరత్తులు ప్రారంభించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు విజయాన్ని అందించే బాధ్యతలు సైతం పీకే స్వీకరించిన విషయం తెలిసిందే. 


Also Read: ఫిబ్రవరి 16.. ఉ.11 గంటలు.. రామ్‌లీలా మైదాన్..


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..