తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని ఓ వింత ఘటన చోటుచేసుకుంది. తిరువెరుంబూర్‌ సమీప అరియమంగళంలో తల్లి మృతదేహంపై కూర్చొని ఓ అఘోర పూజ చేయడం స్థానికంగా కలకలం రేపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడులో ప్రస్తుతం అఘోరాలు అనేక ప్రాంతాల్లో తమ ఇష్ట దేవతలకు ఆలయాలు నిర్మించి పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మణికంఠన్‌ అనే అఘోర కాశీలో అఘోర శిక్షణ పొంది స్థానికంగా జయ్‌ అఘోర కాళీ ఆలయాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ ఆలయంలో ప్రతి వారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. నవరాత్రి ఉత్సవం కూడా జరుపుకుంటారు.  


ప్రస్తుతం ఆలయంలో నవరాత్రి ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మణికంఠన్‌ తల్లి మేరీ హఠాత్తుగా చనిపోయింది. ఈ వార్త తెలిసి అఘోరాలు పెద్ద సంఖ్యలో వచ్చి మేరీ మృతదేహాన్ని ఊరేగింపుగా శ్మశానవాటికకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో మణికంఠన్‌.. తన తల్లి మృతదేహాంపై కూర్చుని మంత్రాలు చదువుతూ పూజ చేశాడు. దీనిపై కొందరు ఆందోళన వ్యక్తం చేయగా.. మరికొందరు అక్కడ ఎం జరుగుతోందో అని ఆసక్తిగా చూశారు.