Agniveer Recruitment 2022 Air Force: అగ్నివీర్‌గా మారాలనుకుంటున్నారా..వాయుసేన నుంచి రిజిస్ట్రేషన్ షురూ..!
Agniveer Recruitment 2022 Air Force: త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద అగ్నివీర్‌లను నియమించనున్నారు. అగ్నిపథ్‌లో తొలి నోటిఫికేషన్ వాయుసేన నుంచి వచ్చింది.
Agniveer Recruitment 2022 Air Force: త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద అగ్నివీర్‌లను నియమించనున్నారు. అగ్నిపథ్‌లో తొలి నోటిఫికేషన్ వాయుసేన నుంచి వచ్చింది. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. నేటి నుంచి అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈఏడాది డిసెంబర్ నుంచి అగ్నివీరుల తొలి బ్యాచ్ మొదలుకానుంది.
రిక్రూట్‌మెంట్ గురించి ప్రత్యేక విషయాలు మీ కోసం..
అభ్యర్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్ indianairforce.nic.inలో నోటిఫికేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తు, ఎంపిక, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి వచ్చే నెల 5 వరకు కొనసాగుతుంది.
దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోండి..
వాయుసేనలో అగ్నివీర్‌లా చేరాలనుకుంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. agnipathvayu.cdac.inలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్ పోర్టల్ ఉదయం పది గంటల నుంచి యాక్టివ్‌గా ఉంటుంది. మొదట అభ్యర్థులు ప్రాథమిక వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఫామ్ సమర్పణ కోసం దరఖాస్తు రుసుము రూ.250 డిపాజిట్ చేయాలి.
అగ్నివీరుల అర్హతలు ఏంటి..
మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 12 లేదా అంతటి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణ సాధించాలి. లేకపోతే మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా, రెండేళ్ల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి వయస్సు 17.5 ఏళ్ల నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. అగ్నివీరులు ..నాలుగేళ్ల సర్వీసు కోసం ఎంపిక చేయబడతారు.
అగ్ని వీరుల జీతభత్యాలు..
- ప్రతి ఏటా జీతం అలవెన్సులు ఉంటాయి
- మొదటి సంవత్సరం రూ.30 వేల జీతం, ఇతర అలవెన్సులు
- రెండో సంవత్సరం రూ.33 వేల జీతం, ఇతర అలవెన్సులు
- మూడో ఏటా రూ.36,500 జీతం, ఇతర అలవెన్సులు
- నాలుగో సంవత్సరం రూ.40 వేల జీతం, ఇతర అలవెన్సులు
- జీతంలో 30 శాతం సొమ్మును తగ్గించి సేవా నిధిలో జమ చేస్తారు.
- నాలుగేళ్లల్లో అగ్నివీర్ మొత్తం రూ.10.4 లక్షల నిధిని డిపాజిట్ చేస్తాడు
- మొత్తం సొమ్ముకు వడ్డీతో కలిపి రూ.11.71 లక్షలు అవుతుంది.
- అగ్నివీర్ ఫండ్‌కు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది
- అగ్నివీర్ సర్వీసు పూర్తి కాగానే ఫండ్ అందుబాటులో ఉంటుంది
- 4 ఏళ్ల సమయంలో ప్రతి ఏటా అగ్నివీరులకు 30 రోజుల సెలవులు ఉంటాయి
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వేగంగా నైరుతి గాలులు..ఇవాళ్టి వెదర్ రిపోర్ట్ ఇదే..!
Also read:Chandrababu on Police: పోలీసులా..వైసీపీ కార్యకర్తలా..తాము వచ్చాక తాట తీస్తామన్న చంద్రబాబు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.