Smartphone For Vaccination: కొవిడ్ వైరస్ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. దీని కంటే ముందు అనేక వేరియంట్స్ ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన వేయించుకునే విధంగా ప్రపంచ దేశాలన్నీ చర్యలు చేపడుతున్నాయి. వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాయి. భారతదేశంలోనూ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆకర్షణ చర్యలు చేపడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్హులైనవారిని వ్యాక్సినేషన్‌ వైపు ఆకర్షించేందుకు అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఏఎంసీ) అధికారులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు ఓ లక్కీ డ్రా పథకాన్ని ప్రారంభించారు. డిసెంబర్‌ 1 నుంచి 7 వరకు ఎవరైతే రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకుంటారో లక్కీడ్రా తీసి వారిలో ఒకరిని విజేతగా ప్రకటించనున్నారు.


లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన వ్యక్తికి రూ.60,000 విలువ చేసే స్మార్ట్‌ఫోన్‌ బహుమతిగా ఇవ్వనున్నట్టు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు బుధవారం వెల్లడించారు. మరోవైపు వ్యాక్సినేషన్ వంద శాతం సాధించేందుకు అహ్మదాబాద్‌ పురపాలక సంస్థ ఇలాంటి ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా వేలాది మందికి (ముఖ్యంగా మురికివాడల్లో ఉన్న జనాలకు) కిలో చొప్పున వంట నూనె ప్యాకెట్లను పంపిణీ చేసింది.


అహ్మదాబాద్‌ లో ఇప్పటి వరకు 78.7 లక్షల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వారిలో 47.7 లక్షల మంది తొలి డోసు.. 31 లక్షల మందికి రెండు డోసులూ పూర్తయినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకోని వారు.. రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారిని పర్యాటక ప్రాంతాలకు అనుమతించబోమని అధికారులు వెల్లడించారు.


అర్బన్‌/కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఆస్పత్రుల్లోకి టీకా వేయించుకోనివారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆస్పత్రులకు వచ్చే వారి కోసం ప్రవేశ ద్వారాల వద్ద ప్రత్యేక పాయింట్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.


Also Read: Covishield booster dose: త్వరలో బూస్టర్​ డోసుగా కోవిషీల్డ్​​?.. డీసీజీఐని కోరిన సీరమ్​!


Also Read: Parliament Fire Today: పార్లమెంట్ లో అగ్ని ప్రమాదం.. కుర్చీలు, కంప్యూటర్లు దగ్ధం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook