కరోనా థర్డ్ వేవ్ అనగానే చిన్నారులకు కరోనా సోకుతుందని ఆందోళన మొదలవుతుంది. కనుక థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యేలోగా చిన్నారులకు సైతం కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ (AIIMS Delhi) నేటి నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశీయంగా భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ (Bharat Biotechs Covaxin)ను చిన్నారులపై ఎయిమ్స్ ఢిల్లీ క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టనుంది. ఎయిమ్స్ పాట్నా 12 నుంచి 18 ఏళ్లలోపు వారిపై కోవాగ్జిన్‌తో పిడియాట్రిక్ ట్రయల్స్‌కు శ్రీకారం చుట్టిన మరుసటిరోజు ఎయిమ్స్ ఢిల్లీ చిన్నారులపై కోవాగ్జిన్ క్లినిటల్ ట్రయల్స్ చేస్తోంది. చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ చేయడానికిగానూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) భారత్ బయోటెక్‌కు అనుమతి ఇచ్చింది.


Also Read: Indian Covid-19 Variants: ఇండియన్ కోవిడ్-19 వేరియంట్స్‌కు Kappa మరియు Deltaగా నామకరణం చేసిన WHO


దేశీయంగా ఉత్పత్తి అయిన కోవిడ్19 వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ను చిన్నారులపై ఫేజ్ 2, ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు భారత్ బయోటెక్‌ (Bharat Biotech)కు డీసీజీఐ అనుమతి ఇచ్చిందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు. భారత్‌లో ప్రస్తుతం భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ చేసిన కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్, రష్యా రూపొందించిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. 


కరోనా సెకండ్ వేవ్ బలహీనపడుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు గత 50 రోజులుగా దిగొస్తున్నాయి. తాజాగా కోవిడ్19 మరణాలు తగ్గుముఖం పట్టడంతో కరోనా థర్డ్ వేవ్ మీద శాస్త్రవేత్తలు, ఫార్మా దిగ్గజాలు ఫోకస్ చేస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్‌లో చిన్నారులలో భారీగా కరోనా కేసులు (COVID-19 Infections) నమోదవుతాయని, చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సైతం ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) సూచించింది.


Also Read: 2DG Drug Price: డీఆర్‌డీవో కరోనా మెడిసిన్ 2డీజీ ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook