2DG Drug Price: డీఆర్‌డీవో కరోనా మెడిసిన్ 2డీజీ ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

2DG Covid-19 Drug Price: భారత్‌లో కరోనాపై పోరాటానికి మరో కొత్త ఔషధం జత కానుంది. ఈ ఔషధాన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగ్గింపు ధరలకు అందించనున్నట్లు సమాచారం. కరోనా బాధితులకు చికిత్స కోసం పొడి రూపంలో ఉండే ఒక్కో సాచెట్ ధరను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు.

Written by - Shankar Dukanam | Last Updated : May 28, 2021, 04:16 PM IST
  • డీఆర్‌డీ‌వో రూపొందించిన యాంటీ కరోనా డ్రగ్ 2డియాక్సీ డి గ్లూకోజ్
  • 2డీజీ కరోనా ఔషధం ధరను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, అధికారులు
  • పొడి రూపంలో లభించే 2డీజీ కరోనా ఔషధం ఒక్కో సాచెట్ ధర రూ.990
2DG Drug Price: డీఆర్‌డీవో కరోనా మెడిసిన్ 2డీజీ ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

డీఆర్‌డీవో రూపొందించిన కోవిడ్-19 ఔషధం ధరను డాక్టర్ రెడ్డీస్ నిర్ణయించింది. కరోనా బాధితులకు చికిత్స కోసం పొడి రూపంలో ఉండే (2-DG anti-COVID-19 Drug) ఒక్కో సాచెట్ ధర రూ.990గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో భారత్‌లో కరోనాపై పోరాటానికి మరో కొత్త ఔషధం జత కానుంది. ఈ ఔషధాన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగ్గింపు ధరలకు అందించనున్నట్లు సమాచారం.

భారత్‌లో ఇదివరకే కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి. కరోనాపై పోరాటంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీవో ఈ 2-డియాక్సీ-డి-గ్లూకోజ్ (2-deoxy-D-glucose) యాంటీ కోవిడ్19 ఔషధాన్ని తయారుచేసింది. భారత్‌లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆక్సిజన్ కొరత సమస్యకు ఈ ఔషధం కొంతమేర పరిష్కారాన్ని చూపించనుందని తెలుస్తోంది. పౌడర్ రూపంలో ఉండే ఈ కరోనా మెడిసన్ వాడితే ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులు త్వరగా కోలుకుంటారని సైతం ధీమా వ్యక్తం చేసింది. 

Also Read: India Corona Cases Today: భారత్‌లో 44 రోజుల కనిష్టానికి కరోనా పాజిటివ్ కేసులు

మే 17న తొలి బ్యాచ్ కింద 10 వేల 2డీజీ డ్రగ్ సాచెట్స్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఆపై మే 27న 10వేల సాచెట్స్ మార్కెట్‌లోకి వచ్చాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల తెలిపారు. కరోనాపై పోరాటాన్ని ముమ్మరం చేయడానికిగానూ ఈ 2-డియాక్సీ-డి-గ్లూకోజ్ యాంటీ కరోనా (COVID-19) ఔషధం అత్యవసర వినియోగానికి డీజీసీఏ ఆమోదం పొందింది. తాజాగా 2డీజీ ఔషధం మార్కెట్‌లోకి విడుదల అయింది. త్వరలో పూర్తిస్థాయిలో మార్కెట్లో లభించేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. 

Also Read: Covaxin vaccines: 4 కోట్ల కోవ్యాగ్జిన్ షాట్స్ మిస్ అయ్యాయా ? అవేమయ్యాయి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News